OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?

    OTT Suggestions: ఈ చిత్రం 7 ఆస్కార్ అవార్డులు కొట్టింది… తెలుగులో ఉన్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా చూశారా?

    April 13, 2024

    ఓటీటీలో ప్రతీ వారం పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్‌లు రిలీజవుతుంటాయి. వాటిలో ఏది చూడాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. అద్భుతమైన చిత్రాలు ఏమైనా ఉన్నాయా? అని తెగ సెర్చ్‌ చేస్తుంటారు. అటువంటి వారి కోసం YouSay ఓ మంచి హాలీవుడ్‌ చిత్రాన్ని తీసుకొచ్చింది. 95వ ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో సత్తా చాటిన ఆ చిత్రం.. మీ వీకెండ్‌ను ఫుల్‌ఫిల్‌ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందుకు చూడాలి? తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం. 

    ఆ సినిమా ఏదంటే?

    2023లో 95వ ఆస్కార్స్‌ అవార్డ్స్‌ కోసం అత్య‌ధిక నామినేష‌న్స్‌ను సొంతం చేసుకున్న సినిమాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ (Everything Everywhere All at Once) సినిమా నిలిచింది. మొత్తం 11 విభాగాల్లో నామినేష‌న్స్‌ను పొందిన ఈ సినిమా ఏకంగా 7 ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుని యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ కూడా తెగ ప్రయత్నించారు. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లీవ్‌ (SonyLIV)లో మెుదట ఇంగ్లీష్‌ వెర్షన్‌ మాత్రమే రిలీజ్‌ కావడంతో నిరాశ చెందారు. తెలుగు వెర్షన్‌ కోసం కొన్ని రోజులు ఎదురు చూసినా రాకపోవడంతో తమ పనుల్లో పడిపోయి సినిమా గురించి మర్చిపోయారు. అయితే ప్రస్తుతం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను మిస్‌ అయ్యామని బాధపడుతున్నా వారంతా ఈ వీకెండ్‌ చూసేయండి. 

    ఊహకందని కాన్సెప్ట్‌తో..

    హాలీవుడ్‌ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ‘మల్టీవర్స్‌’ (Multiverse) అనే పదం చాలా సుపరిచతం. మార్వెల్‌ సినిమాలు అన్నీ దాదాపుగా ‘మల్టీవర్స్‌’ కాన్సెప్ట్‌తోనే వచ్చాయి. ఈ ఆస్కార్‌ విన్నింగ్‌ చిత్రం ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వ‌న్స్’ కూడా దాదాపుగా అదే కాన్సెప్ట్‌తో రూపొందింది. మ‌నిషిని పోలిన మ‌నుషులు మిగిలిన ప్యార‌లాల్ యూనివ‌ర్స్‌ల‌లో ఉంటార‌నే పాయింట్‌తో దర్శకులు డేనియల్‌ క్వాన్‌, డేనియల్‌ షైనెర్ట్‌ ఈ మూవీని తెరకెక్కించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద డాలర్ల వర్షం కురిపించింది. 

    కథ కోసం 8 ఏళ్ల శ్రమ

    కొత్త తరహా సినిమాను ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు క్వాన్‌, షైనెర్ట్‌.. 2010లోనే ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ కథ రాయడం మొదలుపెట్టారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కేవలం కథపైనే దృష్టి పెట్టిన వీరిద్దరు.. 2018లో తమ సినిమాను ప్రకటించారు. 2020లో ఈ సినిమా చిత్రీకరణ మెుదలు కాగా.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2 గంటల 19 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టించింది. సుమారు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. దాదాపు 108 మిలియన్‌ డాలర్లు ఈ చిత్రం వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

    కథేంటి

    ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. మిషెల్‌ యో, కి హుయ్‌ క్వాన్‌, జామీ లీ కర్టిస్‌ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. కథలోకి వెళ్తే.. ఎవిలిన్‌ క్వాడ్‌ అనే చైనీస్‌ మహిళ కుటుంబంతో అమెరికాకు వలస వచ్చి లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కాలంతో పోరాడుతూ బ్లాక్ హోల్ ప్రమాదం నుంచి విశ్వాన్ని ఏ విధంగా రక్షించింది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. 

    Telugu.yousay.tv Rating : 3.5/5 
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version