ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన ‘సేవ్ ద టైగర్స్ 2’ (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పావని గంగిరెడ్డి ఎవరు?
ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి.
పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది?
హైదరాబాద్
పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ?
ఆగస్టు 23, 1987
పావని గంగిరెడ్డి వయసు ఎంత?
37 సంవత్సరాలు (2024)
పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు?
ఓబుల్ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్ హెడ్‌మాస్టర్), శాంతి గంగిరెడ్డి (హౌస్ వైఫ్)
పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా?
సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి
పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది?
బీటెక్ చేసింది.
పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా?
అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్ రెడ్డితో పెళ్లి జరిగింది.
పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు?
హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్ గూప్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు.
పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు?
ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా.
పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్ చేసింది. తర్వాత కండ్యూయెంట్ బిజినెస్ సర్వీస్ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది.
పావని గంగిరెడ్డి తొలి సినిమా?
‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది.
పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు?
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.
పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు?
‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్’ (Looser) ‘సేవ్ ద టైగర్స్ 1 & 2’ (Save The Tigers S1 & S2), ‘వ్యూహాం’ (Vyooham).
పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు?
విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్
పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు?
పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.
పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం?
దోశ, పిజ్జా
పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్?
తన ఫేవరేట్ హీరో, హీరోయిన్ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు.
పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ?
https://www.instagram.com/pavani_gangireddy/?hl=en