Pavithra Jayaram – Chandrakanth: బుల్లితెరను కుదిపేస్తున్న పవిత్ర – చందుల మరణాలు.. వీళ్ల ప్రేమ కథ ఏంటీ?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pavithra Jayaram – Chandrakanth: బుల్లితెరను కుదిపేస్తున్న పవిత్ర – చందుల మరణాలు.. వీళ్ల ప్రేమ కథ ఏంటీ?

    Pavithra Jayaram – Chandrakanth: బుల్లితెరను కుదిపేస్తున్న పవిత్ర – చందుల మరణాలు.. వీళ్ల ప్రేమ కథ ఏంటీ?

    May 18, 2024

    బుల్లితెర నటీనటులు పవిత్ర జయరామ్‌ (Pavithra Jayaram), చంద్రకాంత్‌ (Chandra Kanth) అలియాస్‌ చందుల వరుస మరణాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. త్రినయని సీరియల్‌ ఫేమ్‌ పవిత్ర జయరామ్‌ కొన్ని రోజుల క్రితం కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను తట్టుకోలేక ఆమె ప్రియుడు చంద్రకాంత్‌.. శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వార్త బుల్లితెరను షాక్‌కు గురిచేసింది. అయితే చంద్రకాంత్‌ – పవిత్రలకు గతంలోనే వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. దీంతో పవిత్ర – చంద్రకాంత్‌ల రిలేషన్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు వారి లవ్‌ స్టోరీ ఏంటి? వారికి ఎలా పరిచయం ఏర్పడింది? అసలు వీరి మెుత్తం ఎపిసోడ్‌ ఏంటి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

    ఆ సీరియల్‌తో పరిచయం

    పవిత్ర జయరామ్‌ – చంద్రకాంత్‌ల (Pavithra Jayaram – Chandrakanth Love Story) గురించి పూర్తిగా తెలియని వారు.. ఈ జంట క్లోజ్‌నెస్‌ చూసి నిజంగా భార్య భర్తలేమో అని భ్రమపడుతుంటారు. నిజానికి వారి మధ్య వైవాహిక బంధం లేదు. గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. మెుదటిసారి త్రినయని అనే సీరియల్‌లో పవిత్ర – చందులకు కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. అక్కడ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్‌లోనూ వీరు కలిసి నటించగా ఈ బంధం మరింత బలపడింది. అలా పవిత్ర – చందు దాదాపు 5ఏళ్లుగా లివింగ్ రిలేషన్‌లో ఉంటూ వచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంతలోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. 

    ప్రమాదం ఎలా జరిగింది?

    ఆదివారం రోజు (మే 12) తెల్లవారు జామున బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న పవిత్ర జయరామ్‌ కారు మహబూబ్‌నగర్‌ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె మృతి చెందింది. ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉండగా.. అతడు గాయాలతో బయటపడ్డాడు. అయితే పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు తన కళ్ల ముందే ఆమె ప్రాణాలు వదలడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లి కుమిలిపోతున్నాడు. ఈ ప్రమాదంలో తాను మరణించి.. పవిత్ర బతికున్నా బాగుండేదంటూ పలు మీడియా ముఖంగా కన్నీరు మున్నీరయ్యాడు. 

    ప్రమాదంపై షాకింగ్‌ నిజాలు

    పవిత్ర మరణం తర్వాత ఇచ్చిన ఇంటర్యూలో చంద్రకాంత్‌ (Pavithra Jayaram – Chandrakanth Relation) షాకింగ్ నిజాలు వెల్లడించాడు.  ‘కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేము బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టు ఒప్పుకుని కొంత అడ్వాన్స్‌ తీసుకుని హైదరాబాద్‌కు బయలుదేరాం. కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. డ్రైవర్‌ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. బస్‌ మమ్మల్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే గాయాలయ్యాయి. పవిత్రకు పెద్దగా దెబ్బలు తగల్లేదు. అయితే నన్ను రక్తపు మడుగులో చూసి ఆమె షాక్‌లోకి వెళ్లింది. అంబులెన్స్‌ ఆలస్యంగా రావడం వల్లే పవిత్ర మరణించింది. అంబులెన్స్‌ టైంకు వచ్చుంటే పవిత్ర బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు తెలిపారు’ అని పేర్కొన్నాడు. 

    ఆ రోజున మరింత డ్రిపెషన్‌లోకి..!

    పవిత్ర మరణాన్ని తట్టుకోలేని చంద్రకాంత్‌ సుసైడ్‌ చేసుకోవాలని రెండ్రోజుల క్రితమే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావటంతో.. చంద్రకాంత్ మరింత డిప్రెషన్‌కి లోనయ్యాడు. ‘రెండు రోజులు ఆగు..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీన్ని బట్టి చూస్తే అతడు తన మరణం గురించి చెప్పకనే చెప్పాడని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు ప్రతి రోజూ ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పోస్టుల రూపంలో ఇన్‌స్టాలో పోస్ట్ చేసి తనలోని బాధను  వ్యక్తం చేశాడు. మూడ్రోజుల క్రితం.. ‘గుడ్ మార్నింగ్ నాన్న.. ఇట్స్ టైమ్ ఫర్ జిమ్.. మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు.. లవ్ యూ పాపా..’ అంటూ చందు వరుస పోస్టులు పెట్టాడు. 

    ఫ్యాన్‌కు ఉరివేసుకొని సూసైడ్‌

    పవిత్రా జయరాం చనిపోవటంతో చంద్రకాంత్‌ మానసికంగా కుంగిపోయాడు. ఈ తరుణంలోనే హైదరాబాద్‌ మణికొండ మున్సిపాలిటీ అల్కాపూర్‌ రోడ్డు నెంబర్‌ 20లో ఉన్న అపార్టుమెంట్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మానసిక ఒత్తిడిలో ఉన్న చంద్రకాంత్‌కు స్నేహితులు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఎంతకూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవటంతో వారు ఫ్లాట్‌కు వచ్చి చూసి చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    చంద్రకాంత్‌ భార్య ఏమందంటే?

    చంద్రకాంత్‌.. 2015లో శిల్ప అనే మహిళను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ఆమెను దూరం పెట్టి పవిత్రతో జీవిస్తున్నాడు. తాజాగా చంద్రకాంత్‌ సుసైడ్‌తో అతడి భార్య స్పందించింది. ‘గతంలో చందు నా వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు. పవిత్రతో రిలేషన్‌లో ఉంటూ నన్ను, పిల్లల్ని వదిలేసాడు. పవిత్ర మీద చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. పవిత్ర సడెన్‌గా చనిపోవడంతో డిప్రెషన్‌లో ఉన్నాడు. మూడ్రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టాడు. నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్‌కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే చందు సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పారు. నాకు, నా పిల్లలకి న్యాయం జరగాలి’ అని శిల్ప వ్యాఖ్యానించింది. 

    సూసైడ్‌పై ముందే క్లారిటీ!

    చంద్రకాంత్‌ మరణంపై (Pavithra Jayaram – Chandrakanth Deaths Episode) అతడి తండ్రి వెంకటేష్‌ మీడియాతో మాట్లాడారు. పవిత్రతో రిలేషన్ ఉన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పిల్లల్ని వదిలేశాడు. గత ఐదేళ్లుగా చందు మా ఇంటికి కూడా రాలేదు. పవిత్ర చనిపోయిన తర్వాత మూడురోజుల క్రితం ఇంటికి వచ్చాడు. పవిత్ర దగ్గరికి వెళ్లిపోతున్నా అని చెప్పాడు. మేము అలా చేయొద్దని వారించాం. నిన్న (శుక్రవారం) పొద్దున లకడికపూల్ వెళ్లి వస్తా అని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాల్స్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఫ్లాట్‌ డోర్ పగలగొట్టి చూస్తే బాల్కనీలో సూసైడ్ చేసుకొని ఉన్నాడు. పోస్ట్ మార్టం కోసం చందు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తీసుకెళ్లారు’ అని చందు తండ్రి వాపోయారు. 

    పవిత్ర సీరియల్‌ ప్రస్థానం

    కర్ణాటక మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం.. కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ‘జోకలి’ సీరియల్‍తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా వినాయక’ సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. తెలుగులో ‘త్రినయని’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు. పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version