Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

    Pawan Kalyan: ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌? 2025లో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

    October 16, 2024

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గతేడాది మూడు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలను పట్టాలెక్కించి ఏపీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఏపీ ఎన్నికల దృష్ట్యా షూటింగ్స్‌ బ్రేక్‌ ఇచ్చిన పవన్‌ ఎన్నికల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరింత బిజీగా మారిపోయారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై నాలుగు కావస్తుండటంతో ఇప్పుడిప్పుడే పవన్‌ తీరిక చేసుకొనిమరి పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్‌ పెట్టారు. ఇటీవల హరిహర వీరమల్లును సెట్స్‌పైకి తీసుకెళ్లారు. తాజాగా ఓజీ సినిమాను సైతం పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది ఏకంగా రెండు సినిమాలతో పవన్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. 

    ‘ఓజీ’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌!

    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు కల్ట్ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అందులో ఒకటైన ‘ఓజీ’ చిత్రం సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ అయినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్‌ 26న ఓజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు స్ట్రాంగ్ బజ్‌ వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 28న హరిహర వీరమల్లును రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాలు 2025లో వస్తుండటంతో ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా అని చెప్పవచ్చు. 

    ఓజీ షూటింగ్‌ రీస్టార్ట్‌

    పవన్‌ కల్యాణ్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్స్‌లలో ఒకటైన ‘ఓజీ’ (OG Movie) కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ ‘ఓజీ’ షూటింగ్‌ తాజాగా తిరిగి ప్రారంభం అయింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. షూటింగ్ లొకేషన్‍లో యూనిట్‍తో డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతున్న ఓ డార్క్ ఫొటోను నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్‌ మీడియాలో పంచుకుంది. ‘అన్ని సిలిండర్లను ఫైర్ చేసి మ్యాడ్‍నెస్‍ను సృష్టించేందుకు మేం మళ్లీ ఓజీ ఫీవర్‌లోకి అడుగుపెట్టేశాం’ అంటూ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ పోస్టర్‌ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారింది. 

    త్వరలోనే సెట్స్‌పైకి పవన్‌!

    ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్‌ను ప్రారంభించారు. ఇందుకోసం విజయవాడలో మేకర్స్ భారీ సెట్‌ను సైతం వేశారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఈ మూవీని తొలుత పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీని సైతం హరిహర వీరమల్లు టీమ్‌ ఫిక్స్‌ చేసింది. అయితే తాజాగా ఓజీ షూటింగ్‌ను తిరిగి పునఃప్రారంభించారు సుజీత్‌. ముందుగా పవన్‌ లేని సీన్స్‌ను డైరెక్టర్‌ సుజీత్‌ షూట్‌ చేయనున్నారు. కొద్ది రోజుల్లో పవన్‌ కూడా ఈ మూవీ షూటింగ్‌ పాల్గొంటారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఓజీ షూటింగ్ మళ్లీ మొదలు కావడంతో పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ షూట్‌లో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. 

    హైప్‌ పెంచిన థమన్‌!

    పవన్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’ చిత్రంలో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇటీవల ఈ సినిమా గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం’ అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్‌ మరింత జోష్ పెంచారు. థమన్‌ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. 

    ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ సంగతేంటి?

    గబ్బర్‌ సింగ్ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత పవన్ కల్యాణ్‌ – హరీశ్‌ కాంబోలో రాబోతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌‘. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్‌ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్‌ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్‌ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్‌ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

     

    పవన్‌ vs విజయ్‌ దేవరకొండ!

    ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ తేదీని ప్రకటించడంతో బాక్సాఫీస్‌ వద్ద పవన్‌, విజయ్‌ దేవరకొండ తలపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజయ్‌ నటిస్తున్న ‘VD 12’ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అటు హరిహర వీరమల్లు టీమ్‌ కూడా అదే డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పవన్‌ లాంటి బిగ్‌స్టార్‌ను విజయ్‌ దేరరకొండ ఢీకొట్టక తప్పదని ఫిల్మ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే పవన్‌కు అత్యంత సన్నిహితులైన సితారా నిర్మాతలు ‘VD 12’ను నిర్మిస్తున్నారు. కాబట్టి పవన్‌కు పోటీగా వారు తమ చిత్రాన్ని బరిలోకి దింపే అవకాశం లేకపోవచ్చని సమాచారం. మరో కొత్త డేట్‌ను చూసుకొని VD12ను రిలీజ్‌ చేసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version