Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్.. వీడియో వైరల్

    Pawan Kalyan: రియల్ హీరో అనిపించుకున్న పవన్.. వీడియో వైరల్

    November 29, 2024

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కాకినాడ పోర్టులో అకస్మిక తనిఖీలు నిర్వహించాడు. సముద్రంలో సుమారు 9 నాటికల్‌ మైళ్ల దూరంలో పట్టుబడిన 640 టన్నుల బియ్యాన్ని పవన్ (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port) ప్రత్యేక బోటులో వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం సీజ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ వ్యవహారం చూసి పవన్‌ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ రీల్‌ హీరో మాత్రమే కాదని రియల్‌ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. వంద ‘ఓజీ’ చిత్రాలు కలిసి వచ్చిన ఇవ్వని కిక్‌ పవన్‌ ఇవాళ ఇచ్చారని కామెంట్స్‌ చేస్తున్నారు. 

    అసలేం జరిగిందంటే?

    రెండ్రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ రవాణాకు సిద్ధమైన రేషన్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. తీరం నుంచి 9 నాటికల్‌ మైళ్ల దూరంలో రవాణ నౌకలో ఉన్న 640 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఆయన పట్టుకున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత, పౌరసరఫరాల మంత్రి పవన్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పవన్‌ నేరుగా (Pawan Kalyan Seize Ration)కాకినాడ పోర్టుకు వెళ్లారు. ప్రత్యేక బోటులో సముద్రంలో ఉన్న నౌక వద్దకు వెళ్లి సీజ్‌ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఈ రేషన్‌ను తరలించేందుకు యత్నించారని అధికారులు పవన్‌కు వివరించారు. ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారని సంబంధిత అధికారులపై పవన్‌ మండి పడ్డారు. డీఎస్పీ రఘువీర్ విష్ణువు, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండబాబును నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

    ‘రేషన్‌ మాఫియాను వదిలి పెట్టను’

    సీజ్‌ చేసిన రేషన్‌ను పరిశీలించిన అనంతరం కాకినాడ పోర్టులో పవన్‌ (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port) ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. వివిధ దేశాలకు ఈ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి అవుతుందన్న పవన్‌ అటువంటి పోర్టులో 16 మంది సిబ్బందే ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడ్డారు. బియ్యం అక్రమ రవాణా వెనుక డీప్‌ నెట్‌వర్క్‌ పనిచేస్తోందని అన్నారు. దాని వెనక ఎవరున్నా వదిలిపెట్టమని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచే విషయమై హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా చూసి పవన్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. పవన్‌ రియల్‌ లైఫ్‌లోనూ అక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారని ఫ్యాన్స్‌తో పాటు సాధారణ పౌరులు సైతం ప్రశంసిస్తున్నారు.

    పవన్‌కు సినిమా రేంజ్‌ ఎలివేషన్స్‌

    పవన్‌ బోటు (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port)లో ప్రయాణిస్తున్న వీడియోను ఓ నెటిజన్‌ పోస్టు చేశాడు. పవన్‌ రాకతో మాములు సముద్రం కాస్త ఎర్ర సముద్రంగా మారిపోయిందంటూ వ్యాఖ్యానించాడు. 

    అధికారులకు వార్నింగ్ ఇస్తున్న వీడియోను షేర్‌ చేసిన మరో నెటిజన్‌.. ‘పోర్టును గడ గడ లాడిస్తున్నావ్‌ కదయ్యా’ అంటూ రాసుకొచ్చాడు. 

    డిప్యూటీ ఇస్తే సైలెంట్ అయిపోతాడని అంతా భావించారని, కానీ ఇప్పుడు పవన్‌ టైమ్‌ వచ్చిందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. కూల్‌ లుకింగ్‌లో కనిపించే మాన్‌స్టర్‌ డ్యూటీ ఎక్కిందని హైప్‌ ఇచ్చాడు. 

    పవన్‌ (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port) ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు యానిమల్‌ మ్యూజిక్‌ను జోడించి చేసిన ఈ ఎడిటింగ్‌ వీడియో నెట్టింగ తెగ వైరల్ అవుతోంది. 

    అలాగే ‘దేవర’ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ను పవన్‌ బోటులో ప్రయాణిస్తున్న వీడియోకు సరిగ్గా మ్యాచ్‌ అయ్యేలా లింక్‌ చేయడం ఆకట్టుకుంటోంది.

    పవన్ (Deputy CM Pawan Kalyan Visits Kakinada Port) అధికారులకు వార్నింగ్‌ ఇస్తున్న దృశ్యాలను ‘ఓజీ’లో యాడ్‌ చేయాలని ఓ నెటిజన్‌ రిక్వెస్ట్ చేశాడు. 

    పవన్‌ సినిమాల కంటే రాజకీయాలే చాలా ఇంట్రస్టింగ్‌ ఉన్నాయని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. 

    ఇలాంటి రాజకీయ నాయకుడు కదా మనకు కావాల్సింది అంటూ ఓ రేంజ్‌లో పవన్‌కు హైప్‌ ఇస్తున్నారు నెటిజన్లు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version