Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!

    Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్‌ ఫ్యాన్స్‌.. భయంతో అకౌంట్స్ క్లోజ్‌!

    October 8, 2024

    తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్‌ ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లి దీక్ష విరమించారు. అనంతరం తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సనాతన ధర్మంపై జరుగుతున్న దాడి గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో డీఎంకే, ఉదయనిధి సోషల్‌ మీడియా వింగ్‌ పవన్‌ను టార్గెట్‌ చేసింది. పవన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వ్యక్తిత్వ హననానికి తెరలేపింది. ఇక పవన్‌ ఫ్యాన్స్‌ సైతం రంగంలోకి దిగి ఉదయనిధి ఐటీ సెల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. పవన్ ఫ్యాన్స్ దెబ్బకు డీఎంకే సోషల్‌ మీడియా విభాగం పూర్తిగా వెనక్కి తగ్గింది. నిన్నటి వరకూ పవన్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ చేసిన పలు అకౌంట్లు ప్రస్తుతం క్లోజ్‌ అయ్యాయి.

    చెన్నైలోని తమ హాస్టల్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసిన సనాతన ధర్మం గురించే చర్చ జరుగుతోందంటూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. దీనంతటికీ కారణం పవన్‌ కల్యాణ్‌ అని పేర్కొన్నారు. వచ్చే ఎలక్షన్స్‌లో అధికార డీఎంకే ఒక సీటుకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పాడు.

    పవన్‌పై వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న నటుడు ప్రకాష్‌ రాజ్‌ను సైతం సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. లూజర్‌ అయిన ప్రకాష్‌ రాజ్‌ ఆంధ్రాలో రెండో అతిపెద్ద పార్టీ అధినేత పవన్‌కు రాజకీయాలపై సలహాలు ఇవ్వడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఓ సైకియార్టిస్టును కలిస్తే బాగుటుందని సూచిస్తున్నారు. అంతేకాదు 2019లో బెంగళూరు సెంట్రల్‌ నుంచి పోటీ చేసి ప్రకాష్‌ రాజ్‌ ఏ విధమైన ఘోర ఓటమిని చవి చూశారో గుర్తుచేస్తున్నారు.

    పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మం నినాదాన్ని ఖండిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టిన వ్యక్తుల నిజ స్వరూపాలను సైతం ఫ్యాన్స్ బట్టబయలు చేస్తున్నారు. We Dravidians 2.0 అకౌంట్‌ నుంచి పవన్‌పై తీవ్ర అసభ్యకర పోస్టు వచ్చింది. అయితే ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తి వేరే మతస్తుడని, పైగా మలేసియా పౌరసత్వం తీసుకున్నాడని ప్రూఫ్స్‌తో సహా బయటపెట్టారు. ద్రవిడియన్స్‌ ముసుగులో సనాతన ధర్మపై యుద్దం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

    పవన్‌ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున We Dravidians 2.0 పేజీని టార్గెట్‌ చేయడంతో వారిని తట్టుకోలేక అడ్మిన్‌ తన పేజీను క్లోజ్ చేసుకున్నాడు. ఎగిరెగిరి పడ్డ సీఎంనే 11 సీట్లకు పరిమితం చేశాడని, అంటూ ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. 

    పవన్‌ కంటే తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ బాగా చదువుకున్నాడని చేస్తోన్న ట్రోల్స్‌కి ఫ్యాన్స్‌ గట్టిగానే బదులిస్తున్నారు. పదో తరగతి పాస్ అయిన పవన్‌.. చెన్నై వరదల సమయంలో రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చాడని గుర్తు చేశారు. మరి బాగా చదువుకున్న ఉదయనిధి  ఒక్క రూపాయి కూడా తన జేబులో నుంచి ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. ఉగ్రవాది బిన్‌లాడెన్‌ కూడా సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశాడని, కానీ ఎన్నో బిల్డింగులను బాంబులతో కూల్చి వేశాడని గుర్తు చేశారు.

    ఉదయ నిధి స్టాలిన్‌ ఐటీ సెల్‌ను ధీటుగా ఎదుర్కొవడం ద్వారా సోషల్‌ మీడియాలో మరోమారు పవన్‌ కల్యాణ్‌ సత్తా ఏంటో నిరూపితమైందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ ఐకమత్యంగా ఏర్పడి పవన్‌ వ్యకతిరేక శక్తులను తిప్పికొట్టారని పోస్టులు పెడుతున్నారు. 

    పవన్‌కు వ్యతిరేకంగా వెళ్లాలంటే అతడి ఊర మాస్‌ ఫ్యాన్స్‌ను దాటుకొని వెళ్లాలంటూ ఓ అభిమాని పెట్టిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 

    ఏపీలో ఒకప్పటి అధికార వైఎస్సార్‌సీపీ పార్టీని, మాజీ సీఎం జగన్‌ను పవన్‌ కల్యాణ్‌ ఏ విధంగా ఓడించాడో చూడంటూ పెట్టిన వీడియో సైతం పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. 

    ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూపై తమిళ యూట్యూబ్‌ ఛానెల్ రీసెంట్‌గా ఓ పోల్‌ నిర్వహించింది. ఈ వ్యవహారంలో పవన్‌కే ఏకంగా 89 శాతం మంది మద్దతు లభించింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version