టీమ్‌ఇండియా పేసర్ షమీ (Mohammed Shami)ని తాను పెళ్లిచేసుకుంటానని బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) చేసిన పోస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది.
షమీని తాను పెళ్లి చేసుకోవాలంటే ఓ షరతును కూడా పాయల్ ట్విటర్ వేదికగా విధించింది. షమీ తన ఇంగ్లీష్‌ను మెరుగుపరుచుకుంటే పెళ్లికి సై అంటూ వ్యాఖ్యానించింది.
ఆ పోస్టు నెట్టింట ట్రెండ్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రేమకు భాషతో పనేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
పాయల్ పెళ్లి ప్రపోజల్‌పై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలంటూ మరికొందరు నెటిజన్లు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు.
బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్ ఘోష్ తెలుగు సినీ ప్రేక్షకులకూ సుపరిచితమే. ఆమె పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియన్స్‌కు దగ్గరైంది.
తెలుగులో మంచు మనోజ్(Manchu Manoj) నటించిన ‘ప్రయాణం’ (Prayanam) సినిమాతో పాయల్ వెండితెరకు పరిచయమైంది. అందులో హీరోయిన్‌గా చేసి అందర్ని మెప్పించింది.
ఆ తర్వాత తారక్ (Jr.NTR) ‘ఊసరవెల్లి’ (Oosaravelli) సినిమాలో తమన్నాకు స్నేహితురాలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
2020లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను రేప్ చేశాడంటూ గతంలో పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అనురాగ్‌తో జరిగిన మూడో మీటింగ్‌లోనే అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. అప్పట్లో ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
17 సంవత్సరాల వయసులోనే నటనలోకి అడుగుపెట్టింది పాయల్ ఘోష్. షార్ప్స్ పెరిల్ అనే బీబీసీ టెలిఫిల్మ్‌లో నటించి మెప్పించింది.
ఆ తర్వాత కెనడియన్ చిత్రంలోనూ చేసింది. సినిమాల్లోకి వెళ్లడం ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకపోవటంతో కళాశాలలో చదువుతున్నప్పుడే పారిపోయి ముంబయి వచ్చింది పాయల్. నమిత్ కిషోర్ అకాడమీలో నటనపై మెళుకువలు నేర్చుకుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం షమీ వరల్డ్‌కప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినా 16 వికెట్లు తీసి అదరగొట్టాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు. దీంతో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాయల్ ఘోష్ పెళ్లి ప్రపోజల్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?