పోకో ఇండియా త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోకో M7 ప్రో 5G మరియు పోకో C75 5G ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు ఫోన్ల విడుదల తేదీ, స్పెసిఫికేషన్లు, మరియు ఫీచర్లను పోకో ఇండియా హెడ్ హిమాన్షు టండన్ X (గతంలో ట్విట్టర్) వెల్లడించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ల విడుదల తేదీ డిసెంబర్ 17, 2025 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. వీటి విక్రయాలు ఈకామర్స్ వెబ్‌సైట్స్‌లో ప్రారంభమవుతాయి.
పోకో M7 ప్రో 5G స్పెసిఫికేషన్లు
పోకో M7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల పుల్ HD+ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 92.02% స్క్రీన్ టు బాడీ రేషియోతో ఈ డిస్‌ప్లే ఉన్నట్లు సమాచారం. HDR 10+ సపోర్టు, TUV ట్రిపుల్ సర్టిఫికేషన్, మరియు SGC ఐ కేర్ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 5 రక్షణ కూడా ఈ డిస్‌ప్లేలో ఉంటుంది.
ఇక, పోకో M7 ప్రో 5G స్టోరేజీ, కలర్ వేరియంట్‌లు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
పోకో C75 5G స్పెసిఫికేషన్లు
పోకో C75 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. దీని రీఫ్రెష్ రేట్ 120Hz ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ప్రైమరీ కెమెరా మరియు వెనుక వైపు ట్రిపుల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. పోకో C75 5G స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 4GB RAM మరియు 4GB టర్బో ర్యామ్ కూడా అందుబాటులో ఉంటాయి.
స్టోరేజ్ పరంగా, ఈ ఫోన్ మైక్రో SD కార్డు ద్వారా 1TB వరకు పెంచుకునే సౌకర్యం కలిగి ఉంటుంది. అదేవిధంగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5160mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం.
భారతదేశంలో ఈ ఫోన్ ధర రూ. 9,000 కంటే తక్కువగా ఉండొచ్చు. కానీ, ఇది కేవలం 5G SA నెట్‌వర్క్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. 5G NSA నెట్‌వర్క్‌ను ఇది సపోర్ట్ చేయదు.
ఈ రెండు ఫోన్లు పోకో అభిమానుల కోసం అత్యంత ఆసక్తికరమైన డివైసులుగా మారనుండగా, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అందుబాటులో రానున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం