Poco M6 5G: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వస్తోన్న నయా పోకో మెుబైల్‌.. ప్రత్యేకతలు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Poco M6 5G: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వస్తోన్న నయా పోకో మెుబైల్‌.. ప్రత్యేకతలు ఇవే!

    Poco M6 5G: స్టన్నింగ్‌ ఫీచర్స్‌తో వస్తోన్న నయా పోకో మెుబైల్‌.. ప్రత్యేకతలు ఇవే!

    February 29, 2024

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ కంపెనీ షావోమీ సబ్‌బ్రాండ్ ‘పోకో’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. పోకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో డిసెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. లాంచ్ తేదీతో పాటు మెుబైల్‌ టీజర్‌ను సైతం ట్విటర్‌ (X)లో పోకో ఇండియా పోస్ట్ చేసింది. ఇది పోకో 5జీ సిరీస్‌లో వస్తోన్న రెండవ మెుబైల్‌ అని స్పష్టం చేసింది. ఈ మెుబైల్‌ ‘రెడ్‌మీ 13C’ 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర, ప్రత్యేకతలు వంటి విశేషాలను తెలుసుకుందాం. 

    మెుబైల్ స్క్రీన్

    ఈ పోకో మెుబైల్‌.. 6.47 అంగుళాల HD+ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 600 nits పీక్ బ్రైట్‌నెస్‌, Corning Gorilla Glass ప్రొటెక్షన్‌ను అందించినట్లు తెలుస్తోంది. Android 13 ఆధారిత MIUI 14 OS, Mediatek Dimensity 6100 ప్రొసెసర్‌పై మెుబైల్‌ పని చేయనున్నట్లు సమాచారం. 

    ర్యామ్‌ & స్టోరేజ్

    Poco M6 5G మెుబైల్‌.. మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశముంది.  4GB RAM/128GB ROM, 6GB RAM/128GB ROM,  8GB RAM/256GB స్టోరేజ్‌ వేరియంట్లలో రాబోతున్నట్లు టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. 

    బ్యాటరీ

    ఈ నయా పోకో మెుబైల్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్‌ చేసినట్లు పోకో వర్గాలు పేర్కొన్నాయి. 

    కెమెరా

    Poco M6 5G మెుబైల్‌ను డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరి కెమెరా ఫిక్స్‌ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. ఫోన్‌ ముందు వైపు సెల్ఫీల కోసం 5MP కెమెరాను ఫోన్‌కు అందించినట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ పోకో ఫోన్‌లో 5Gతో పాటు Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, GALILEO, BDS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే సైడ్‌ మౌటెండ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్‌, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉంటాయి.

    కలర్ ఆప్షన్స్‌

    ఈ ఫోన్‌ నాలుగు కలర్‌ వేరియంట్లలో లాంచ్‌ ఛాన్స్ ఉంది. స్టార్‌లైట్‌ (Starlight Black) బ్లాక్‌, స్టార్‌టైల్‌ గ్రీన్‌ (Startrail Green), స్టార్‌టైల్‌ సిల్వర్‌ (Startrail Silver), పర్పుల్‌ (Purple) రంగుల్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 

    ధర ఎంతంటే?

    Poco M6 5G స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్‌ 22 మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు ఫోన్‌ ధరను రివీల్‌ చేయనున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫోన్‌ ధర రూ.10,000 -12,000 మధ్య ఉండవచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version