POCO X6 Neo 5G ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ.19,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు 35% తగ్గింపుతో కేవలం రూ.12,999కి లభిస్తోంది. అదనంగా, బ్యాంకు కార్డులు ఉపయోగించి ₹1,299 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపు ద్వారా ఫోన్ ధరను కేవలం ₹11,700కి పొందవచ్చు. ఇంత తక్కువ ధరలో వినియోగదారులకు POCO X6 Neo 5G అన్ని అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఓసారి ఈ స్మార్ట్ ఫొన్ ఫీచర్లు పరిశీలిద్దాం.
డిజైన్ – డిస్ప్లే
POCO X6 Neo 5G స్మార్ట్ ఫొన్ 6.67 అంగుళాల పూర్తి HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన ఈ డిస్ప్లే, రంగులు, డీటైల్‌లు అద్భుతంగా ఉంటాయి. గేమింగ్, మల్టీమీడియా వినియోగదారులకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల స్క్రోలింగ్ సాఫీగా ఉంటుంది, ప్రత్యేకించి గేమింగ్ సందర్భాల్లో మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఈ డిస్ప్లే పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉండటం వల్ల స్క్రీన్-టు-బాడీ రేషియో 93.3%గా ఉంటుంది. ఇది సినిమాలు, వీడియోలను చూసేటప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
పర్ఫార్మెన్స్
POCO X6 Neo 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా శక్తివంతంగా పనిచేస్తుంది, దీనికి Mali G57 MC2 GPU జతచేయబడింది. దీంతో మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో 8GB RAM ర్యామ్, 128GB అంతర్గత మెమరీ ఉంటుంది. అదనంగా మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ సాఫీగా పనిచేయడానికి MIUI 14, ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారితంగా పనిచేస్తుంది. ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించినా యాప్‌లు సాఫీగా పనిచేయడం, గేమింగ్ టైటిల్స్ సత్వరంగా లోడ్ అవ్వడం వంటి విషయాలలో ఈ ఫోన్ గొప్పగా పని చేస్తుంది.
కెమెరా
POCO X6 Neo 5G స్మార్ట్‌ఫోన్ 108MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. దీంతో నాణ్యమైన ఫోటోలు తీయవచ్చు. 16MP సెల్ఫీ కెమెరా కూడా ఈ ఫోన్‌లో లభిస్తుంది, ఇది లో లైట్ పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. కెమెరా మోడ్‌లలో నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, 3x ఇన్-సెన్సార్ జూమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి వినియోగదారులకు అధునాతన ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తాయి. అయితే, వీడియో స్టెబిలైజేషన్ మాత్రం అంతగా సంతృప్తి పరచదు.
బ్యాటరీ – ఛార్జింగ్
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది ఒకసారి పూర్తి ఛార్జ్ చేయడం ద్వారా రోజంతా సరిపోతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండటం వల్ల ఈ ఫోన్ చాలా తక్కువ సమయంలో పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm ఆడియో జాక్ వంటి అదనపు ఫీచర్లు ఈ ఫొన్‌ను ప్రత్యేకంగా నిలిపాయని చెప్పవచ్చు.
సాఫ్ట్‌వేర్
POCO X6 Neo 5G MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తుంది, ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా రన్ అవుతుంది. డ్యూయల్ యాప్‌లు, సెకండ్ స్పేస్ వంటి ఫీచర్లను అందిస్తుంది. తద్వారా వినియోగదారులు రెండు ఖాతాలను ఒకే ఫోన్‌లో ఉపయోగించవచ్చు. ఈ ఫోన్‌లో 5G సపోర్ట్‌తో పాటు రెండు సిమ్ కార్డులను ఒకేసారి యూజ్ చేయవచ్చు. తద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవాన్ని పొందవచ్చు.
చివరగా
పైన చెప్పిన విధంగా ఆకట్టుకునే ఫీచర్లతో POCO X6 Neo 5G అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌లో మంచి డీల్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ మంచి కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్, సూపర్ అమోలెడ్ డిస్ప్లే, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో మిడ్-రేంజ్ విభాగంలో తెలివైన ఎంపికగా చెప్పవచ్చు.