Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

    Ponniyin Selvan Review: మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా..?

    September 30, 2022

    కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవలను దర్శకుడు మణిరత్నం PS-1తో మొదటి భాగాన్ని తెరకెక్కించాడు. తన డ్రీమ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు, తమిళ, మలయాల, కన్నడ, హిందీ భాషల్లో Sep 30న విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది ఈ మూవీ. మరి మణిరత్నం కలల ప్రాజెక్టు సాకారమైందా?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం.

    కథేంటి..?

    చోళుల రాజ్య కాలం నాటి కథే ఇది. నవలగా ‘పొన్నియన్ సెల్వన్’ తమిళనాట గడప గడపకూ చేరుకుంది. తమిళులకు ఈ చిత్రంలోని పాత్రలు సుపరిచితం. చోళ రాజైన ఆదిత్య కరికాల తను వేసిన ఓ పథకాన్ని అమలు చేసే బాధ్యత వల్లవరాయులుకు అప్పగిస్తారు. ఈ ప్రక్రియలో ఆదిత్యకు తమ్ముడైన పొన్నియన్ సెల్వన్ సూచనలతో వరవరాయులు ఓ కుట్రకు తెరలేపుతాడు. అందులో భాగంగా పలువురిని వల్లవరాయులు సంప్రదిస్తాడు. మరోవైపు, ఆదిత్యపై పగ తీర్చుకోవడానికి నందిని సరైన సమయం కోసం వేచిచూస్తుంటుంది. అసలు వీరిద్దరికీ ఉన్న వైరం ఏంటి? చోళ ప్రధాన రాజైన సుందరుడు తనకు వచ్చిన హెచ్చరికలను ఎలా ఎదుర్కొన్నాడు? రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు? కుందవై ఆదిత్యకు ఎలా సహాయపడింది? అనే అంశాలను తెరపై చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారు..?

    ఆదిత్యగా విక్రమ్ మరోసారి తన ప్రతిభను చూపించాడు. కొన్ని సీన్లలో ‘అరే.. భలేగా చేశాడే’ అని అనిపించేలా నటించాడు. ఇక వల్లవరాయులుగా కార్తీ ఇరగదీశాడు. ఈ నటుడి హ్యూమర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. PS1లో కార్తీకి తగిన ప్రాధాన్యం లభించింది. కుందవై, నందినిలుగా త్రిష, ఐశ్వర్యారాయ్ తళుక్కుమన్నారు. ప్రేక్షకుడిని తమ వైపు తిప్పుకునేలా నటించారు. తెరపై వీరినే చూస్తుండిపోయేంత అందంగా కనిపించారు. అభినయాన్నీ ప్రదర్శించారు. జయం రవి తన పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్‌లలో భళా అనిపించాడు. ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తమ నటనానుభవానికి జీవం పోశారు. ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా చేశారు. ఎవరినీ తక్కువ చేయలేనంతగా నటించారు.

    బలాలు- బలహీనతలు

    దర్శకుడు మణి.. కథ కన్నా పాత్రల చిత్రీకరణపైనే ఎక్కువగా ఆధారపడినట్లు కనిపిస్తుంది. ఆయా సీన్లలో ఫలానా నటుడు భలే చేశాడు అని మాట్లాడుకుంటాం. కానీ, కథలోకి తీసుకులేకపోయాడు. తమిళులు తప్ప మిగతావారు ఆయా పాత్రల నేపథ్యాన్ని త్వరగా అర్థం చేసుకోలేరు. అన్య భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని పాత్రల పరిచయంపై డైరెక్టర్ కాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. సినిమాలో ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తాయి. క్లైమాక్స్ బాగా ప్లాన్ చేశారు. కానీ, రెండో భాగం కోసం ఆతురతగా వేచిచూసేంత స్థాయిలో ఉంటే బాగుండేది. 

     సాంకేతికంగా..?

    ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్‌లో ఉంది. సన్నివేశాలకు అనుగుణంగా వచ్చే నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. రవి వర్మన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పెద్ద అసెట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

    ఫైనల్‌గా.. చోళ రాజ్యానికి తమిళులను మాత్రమే ‘పొన్నియన్ సెల్వన్-1‘ తీసుకెళ్తుంది. 

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version