ఇండియన్ బాక్సాఫీస్ రారాజుగా ప్రభాస్ కొనసాగుతున్నాడు. కలెక్షన్ల పరంగా ఏ ఇండియన్ స్టార్‌కు అందనంత ఎత్తులో నిలబడ్డాడు. ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే ఆ దరిదాపుల్లోకి కూడా కొందరు హీరోలు రావడం లేదు. ప్రభాస్ సినిమా రిలీజ్‌కు నెల రోజులు ముందు లేదా వెనుక తమ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటువంటి సమయంలో ప్రభాస్‌తో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు తమిళ స్టార్ హీరో రెడీ అవుతున్నాడు. ప్రభాస్ అపకమింగ్ ఫిల్మ్ ‘ది రాజాసాబ్’తో బాక్సాఫీస్ వద్ద తేల్చేకునేందుకు సై (Prabhas vs Dhanush) అంటూ సవాలు విసురుతున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ vs ధనుష్
‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్స్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Rajasaab). డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్‌లో తొలిసారి హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నాడు. దీంతో ‘ది రాజాసాబ్’పై ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే తమిళ స్టార్ హీరో ధనుష్, ప్రభాస్ (Prabhas vs Dhanush)ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యాడు. ‘ది రాజాసాబ్’ రిలీజ్ రోజునే తన కొత్త చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఇడ్లీ కడై’ను (Idli Kadai) వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఆ రోజునే ఎందుకంటే!
‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) చిత్రానికి స్టార్ హీరో ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నిత్యామీనన్ చేస్తోంది. డాన్ పిక్చర్స్, వండర్ బార్ ఫిల్మ్స్ పతకాలపై ఆకాశ్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, షాలినీ పాండేలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే బరిలో ప్రభాస్ సినిమా ఉన్నప్పటికీ ధనుష్ తన ‘ఇడ్లీ కడై’ చిత్రాన్ని రిలీజ్ చేయడం వెనక ఓ బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. మన తెలుగు వాళ్లకు ఉగాది ఎలాగో తమిళ వాళ్లకు ఏప్రిల్‌లో వచ్చే న్యూ ఇయర్ కూడా అలాంటిదే. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న తమిళనాడులో న్యూ ఇయర్ జరుపుకుంటారు. పైగా దానికి లాంగ్ వీకెండ్ కూడా కలిసి రాబోతోంది. అందుకే ధనుష్ ఏప్రిల్ 10ని టార్గెట్ చేశారు. మొత్తానికి ‘ది రాజా సాబ్’తో పాటు ధనుష్ మూవీ కూడా రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదు. మరి ఈ రెండు సినిమాల్లో విన్నర్ ఎవరు అనేది మాత్రం చూడాల్సిందే.
అక్కడ ప్రభాస్‌కు ఎదురుదెబ్బ!
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush)కు తమిళంతో పాటు తెలుగు, హిందీలోనూ భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రభాస్‌తో పోలిస్తే మాత్రం కాస్త తక్కువే అని చెప్పాలి. ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా ధనుష్ కంటే చాలా పెద్దది. కాబట్టి పాన్ ఇండియా స్థాయిలో ‘ది రాజాసాబ్’కు ‘ఇడ్లీ కడై’ నుంచి పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. అయితే తమిళనాడులో మాత్రం ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. అక్కడ ధనుష్ పేరు చెబితే అభిమానులు ఊగిపోతుంటారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ‘ది రాజాసాబ్’కు (Prabhas vs Dhanush) గట్టి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. తమిళనాడు కలెక్షన్స్‌లో భారీగా కోత పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అరడజను పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేషన్ కనకరాజ్, బాలీవుడ్ పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ హిరానీతోను త్వరలో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ