Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ! 

    Pushpa 2 Item Song: త్రిప్తి దిమ్రికి షాకిచ్చిన ‘పుష్ప 2’ టీమ్‌.. రంగంలోకి మరో బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ! 

    September 26, 2024

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2: ది రూల్‌’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ కి సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. అయితే పుష్పలో ఐటెం సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. సమంత చేసిన ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దీంతో ఇప్పుడు పార్ట్ 2లో ఐటెం సాంగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రి ‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌ చేస్తుందని అంతా భావిస్తుండగా చిత్ర యూనిట్ ఆమెకు షాకిచ్చినట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్‌ బ్యూటీని తెరపైకి తీసుకొచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    త్రిప్తి దిమ్రిపై అసంతృప్తి!

    ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ  అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు యానిమల్‌ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఫైనల్‌ చేశారని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌ నుంచి రిజెక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల త్రిప్తి దిమ్రితో ఆడిషన్‌ నిర్వహించిన పుష్ప టీమ్‌ దానిపై సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆమె ప్లేసులో మరో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. 

    ఇద్దరు హీరోయిన్స్‌తో బన్నీ స్టెప్పులు!

    ‘పుష్ప 2’లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులోని ఐటెం సాంగ్‌లో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీతో పాటు రష్మిక కూడా స్టెప్పులు వేయబోతున్నట్లు సమాచారం. ఐటెం గార్ల్‌తో పాటు రష్మిక కూడా ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపనుందని ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్ట్‌ 1లో రష్మిక ఉన్నప్పటికీ ఐటెం సాంగ్‌లో ఆమె కనిపించలేదు. ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ అంటూ బన్నీ- సమంత ఇద్దరే స్టెప్పులు ఇరగదీశారు. ఈసారి రష్మికతో కలిసి ఇద్దరు భామలు ఐటెం సాంగ్‌లో కనిపించనుండటంతో మూవీ లవర్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఇద్దరి భామాలతో కలిసి బన్నీ ఏ స్థాయిలో అలరిస్తాడో మరి చూడాలి. 

    కీలకంగా ‘పుష్ప 2’ క్లైమాక్స్‌!

    ‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, విలన్‌ ఫహాద్‌ పాజిల్‌పై పతాక సన్నివేశాలను సుకుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా ఉండబోతున్నాయని అంటున్నారు. తొలి పార్ట్‌లో తరహాలోనే ‘పుష్ప 2’లోనూ క్లైమాక్స్‌ కీలకంగా మారుతుందని పేర్కొంటున్నారు. పైగా మూడో పార్ట్‌కు సంబంధించిన లింక్‌ను కూడా ఈ క్లైమాక్స్‌లో షూట్‌ చేస్తారని సమాచారం. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ సుదీర్ఘంగా కొనసాగుతుందని టాక్‌ వినిపిస్తోంది. 

    సర్‌ప్రైజ్‌ చేసిన రాజమౌళి

    ‘పుష్ప 2’ టీమ్‌ను దర్శకధీరుడు రాజమౌళి సర్‌ప్రైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమా చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిన రాజమౌళి అక్కడకు వెళ్లినట్లు సమాచారం. సుకుమార్‌ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారట. ఈ క్రమంలో సుకుమార్‌ ఒక సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ ఉంటే జక్కన్న అంతే చూస్తూ ఉండిపోయారట. అదిరిపోయిందని మెచ్చుకున్నారట. దాదాపు 30 నిమిషాల పాటు రాజమౌళి అక్కడే ఉన్నారని సమాచారం. చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కీలక వ్యక్తులను రాజమౌళికి సుకుమార్‌ పరిచయం చేశారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ కి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు సుకుమార్‌తో రాజమౌళి చర్చించారట. పుష్ప 2 సెట్‌ కి రాజమౌళి వచ్చిన సందర్భంగా తీసిన వీడియోను త్వరలోనే ఫ్యాన్స్ కోసం విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version