Radhe Shyam Movie Review
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Radhe Shyam Movie Review

    Radhe Shyam Movie Review

    July 20, 2022

    ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూసేందుకు గ‌త నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ‘రాధే శ్యామ్’ వారికి పండ‌గ‌ను తీసుకొచ్చింది. 2018లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొని నేడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించారు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. గోపీ కృష్ణ మూవీస్, టీ సిరీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ఇంత‌కీ క‌థేంటి? పాట‌లు ట్రైల‌ర్స్, మేకింగ్ వీడియో సినిమాపై మరిన్ని అంచ‌నాల‌ను పెంచాయా? అనే విషయాలు తెలుసుకుందాం. 

    విక్ర‌మాదిత్య(ప్ర‌భాస్‌) ఇటలీలో ఒక ప్ర‌ముఖ‌ హ‌స్త‌ముద్రికా నిపుణుడు. చేతి రేఖ‌లు చూసి ఆయ‌న చెప్పే జ్యోతిష్యం క‌చ్చితంగా  నిజ‌మ‌వుతుంటుంది. ఆయ‌న చేతిలో ప్రేమ గీత లేద‌ని తెలుసుకొని జీవితం మీద ఒక క్లారిటీతో ఉంటాడు. కానీ విక్రమాదిత్య జీవితంలోకి ప్రేర‌ణ‌(పూజా హెగ్డే) వ‌స్తుంది. ఆమెను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. జీవితంలో ప్రేమ లేద‌ని తెలిసిన‌ప్ప‌టికీ ఆమె వెంట రోమియోలా తిరుగుతాడు. ప్రేర‌ణ కూడా అత‌డిని ప్రేమిస్తుంది. మ‌రి విధిని ఎదురించి ప్రేమించుకొని వీళ్లుఒక‌ట‌వుతారా? చివ‌రికి  ఏం జ‌రుగుతుంది అనేదే క‌థ‌.

    జ్యోతిష్యాన్ని ఒక ప్రేమ క‌థ‌కు ముడిపెట్టిన విధానం బాగుంది. మ‌న రాత‌ను మ‌న‌మే రాసుకోవ‌చ్చనే ఒక పాయింట్‌ను చెప్పేందుకు దర్శకుడు ప్ర‌య‌త్నించాడు. డైరెక్ట‌ర్ తాను అనుకున్న క‌థ‌ను చాలా స్ప‌ష్టంగా చెప్పాడు.  ప్ర‌భాస్ మాస్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఒక ప్యూర్ ల‌వ్‌స్టోరీలో ఒదిగిపోయాడు.  విక్ర‌మాదిత్య పాత్ర‌కు ప్ర‌భాస్‌ను త‌ప్ప ఎవ‌ర్నీ ఊహించుకోలేనంత‌గా మెప్పించాడు. సినిమాలో చాలా అందంగా, స్టైలిష్‌గా క‌నిపించాడు. పూజా హెగ్డే ప్రేర‌ణ పాత్ర‌లో చాలా బ్యూటిఫుల్‌గా క‌నిపించింది. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అయతే వారి ప్రేమ‌ను మ‌రింత బ‌లంగా చూపించేలా మ‌రిన్ని ఎమోష‌న‌ల్ సీన్స్  రాసుకొని ఉంటే బాగుండేది.

    బాహుబ‌లి, సాహో త‌ర్వాత ప్ర‌భాస్ పూర్తి విభిన్న‌మైన క‌థ‌తో ముందుకొచ్చాడు. ప్ర‌భాస్ సినిమా నుంచి ఆశించిన‌ట్లు యాక్ష‌న్, మాస్ స‌న్నివేశాలు ఉండ‌వు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం మొద‌టినుంచి చెప్తూ వ‌స్తున్నారు. మొద‌టి భాగం యూర‌ప్‌లో చాలా అందంగా తీర్చిదిద్దారు. మ‌ధ్య‌లో క‌రోనా రావ‌డంతో యూర‌ప్ సెట్‌ను ఇండియాలో వేసి చిత్రీక‌రించారు. విజువ‌ల్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ సీన్ భారీ స్థాయిలో తెర‌కెక్కించారు.  

    కృష్ణంరాజు విక్ర‌మాదిత్య గురువుగా న‌టించారు. బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ ప్ర‌భాస్ త‌ల్లిగా న‌టించింది. కానీ ఆమె పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు.  జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం వంటి ప్ర‌ముఖ న‌టులు ఉన్నా వారిని ఎక్కువ‌గా వాడుకోలేదు. ముఖ్యంగా ఈ సినిమాకు వేసిన సెట్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. విజువ‌ల్‌గా సినిమా చాలా బాగుంది. పాట‌లు, వాటి చిత్రీక‌ర‌ణ బాగుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా న‌చ్చుతుంది. 

    రేటింగ్‌: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version