తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్-10 రొమాంటిక్ సాంగ్స్ మీకోసం..
1. ఈ గాలిలో
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అగ్ని పర్వతం’ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ గాలిలో’ పాట అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు. కృష్ణ ఫొటోలతో ఈ పాట సాగుతుంది. ఓ సీన్‌లో హీరోయిన్ విజయశాంతి కృష్ణ ఫొటోపై పడుకొని అతని కోసం కళ్లతో వెతుకుతూ పాడుతుంటుంది. ఆమె తన తలను పైకి ఎత్తి కిందకి చూసే సరికి ఫొటో ప్లేస్‌లో కృష్ణ కనిపిస్తారు. రాఘవేంద్రరావు సృజనాత్మకత ఏ పాటిదో ఈ ఒక్క సీన్ తెలియజేస్తుంది.
2. అబ్బని తియ్యని దెబ్బ
చిరంజీవి – శ్రీదేవి జంటగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్ రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులోని ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్. చిరంజీవి, శ్రీదేవి వేసే రొమాంటిక్ స్టెప్పులను చూసి ఈ జనరేషన్ వారు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తుంటారు. ఈ పాటలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది.
3. మా పెరటి జామ చెట్టు
పెళ్లిసందడి సినిమాలోని ‘మా పెరటి జామ చెట్టు’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్ రవళిని దర్శకేంద్రుడు ఎంతో అందంగా చూపించారు. రవళి బొడ్డుపై జామ పండు పడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి ఆడియన్స్ ఫ్లాట్ కావాల్సిందే.
4. రోజ్ రోజ్ రోజా పువ్వా
అల్లరి ప్రియుడు సినిమాలోని ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’ సాంగ్ రాఘువేంద్రరావు సినిమాల్లోని టాప్-5 సూపర్ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా కచ్చితంగా ఉంటుంది. ఈ పాటలో రమ్యకృష్ణ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. దర్శకేంద్రుడు ఆమెను పాలరాతి శిల్పంలా చూపించారు. పాట మెుత్తాన్ని పూలతో నింపేశారు.
5. సై సై సయ్యారే
‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘సై సై సయ్యారే’ పాటను కూడా రాఘవేంద్రరావు చాలా రొమాంటిక్‌గా తీశారు. కుండలు, గొడుగులను సెట్ ప్రొపార్టీలుగా ఉపయోగించుకొని పాటను తెరకెక్కించారు.
ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
6. భీమవరం బుల్లోడా
‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా’ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట మెుత్తం స్టీల్ బిందెలే కనిపిస్తాయి. నాగార్జున, ఆమని డ్యాన్స్ అలరిస్తుంది.
7. మీనా మీనా
‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాలోని ‘మీనా మీనా’ పాట రాఘవేంద్రరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. శిల్పా శెట్టి నడుముపై వెంకటేష్ ముత్యాలు వేసే సీన్ దర్శకేంద్రుడి మార్క్‌ను చూపిస్తుంది.
8. అస్మదీయ
అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలోనూ దర్శకేంద్రుడు తన మార్క్‌ను విడిచిపెట్టలేదు. మోహన్ బాబు, రోజాల మధ్య వచ్చే ‘అస్మదీయ’ పాటలో మళ్లీ పండ్లకు పని చెప్పారు. ద్రాక్ష పండ్ల నడుమ రోజా నడుమును చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
9. చాలు చాలు
శ్రీరామదాసు సినిమాలోని ‘చాలు చాలు’ పాట కూడా రాఘవేంద్రరావు రొమాంటిక్ పాటలలో ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటలో నాగార్జున, స్నేహా మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది.
10. గందర్వ లోకాల
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాలోనూ ఆయన మార్క్ కనిపించింది. హీరోయిన్ శ్రీలీలను గందర్వ లోకాల పాటలో ఎంతో అద్భుతంగా చూపించారు. పైనుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీలీల కనిపిస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!