రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ఉత్సాహంగా సాగుతోంది. ఈ యాత్రలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ‘పుష్ అప్’ ఛాలెంజ్‌లో పాల్గొని రాహుల్ గాంధీ మెప్పించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, శివకుమార్, స్థానిక యువకుడితో కలిసి రాహుల్ ఈ పోటీలో పాల్గొన్నారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘రాహుల్ ఒక్కరే సరైన పుష్ అప్స్ తీశారు. మిగతావారు సగం సగం’ అని కామెంట్ చేశారు. కాగా, రోజురోజుకు జోడో యాత్రకు ఆదరణ పెరుగుతోంది.
రాహుల్ గాంధీ ‘పుష్ అప్’ ఛాలెంజ్

Courtesy Twitter:@rssurjewala