టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోమారు సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఎరుపు రంగు ఔట్‌ఫిట్‌లో గులాబీలా మెరిసిపోయింది.
రెడ్ డ్రెస్‌లో రకుల్ అందాలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అతిలోక సుందరి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
హీరోయిన్‌గా రకుల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ తొలినాళ్లలోనే టాప్ చిత్రాలతో ఆకట్టుకుంది.
టాలీవుడ్‌లో రకూల్ తక్కువ సమయంలోనే రామ్‌చరణ్, అల్లు అర్జున్, తారక్, గోపిచంద్, రామ్ పోతినేని, సాయిధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టింది.
‘గిల్లీ’ అనే కన్నడ చిత్రం ద్వారా రకుల్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు.
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఆ సినిమా హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.
‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’, ‘కిక్ 2’, ‘బ్రూస్‌లీ’ వంటి వరుస సినిమాల్లో రకూల్ నటించింది. అయితే అవి పెద్దగా హిట్ కాకపోవడంతో రకుల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధ్రువ’ వంటి సినిమాలు సూపర్ హిట్ సాధించడంతో టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్ గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టిన రకుల్.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది.
ఇటీవల ‘కట్‌పుట్‌లి’, ‘డాక్టర్ G’, ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రివలి’ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.
కమల్‌హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ సినిమాలోనూ రకుల్ నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
అలాగే హీరో శివ కార్తికేయ సరసన ‘అయాలన్’ అనే సైంటిఫిక్ మూవీలోనూ ఈ భామ చేస్తోంది.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి