Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!

    Ram Charan: రామ్‌చరణ్‌ వరల్డ్ రికార్డ్‌.. బ్రిటన్‌ రాణి తర్వాత మనోడే!

    October 23, 2024

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ‘RRR’ బ్లాక్‌ బాస్టర్ తర్వాత అతడు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చరణ్‌ ఇటీవల రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేశాడు. అంబానీ ఇంట వివాహానికి సైతం ఈ కారులోనే వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఈ కారు రిజిస్టేషన్‌కు చరణ్ స్వయంగా వెళ్లారు. ఈ కారుకు సంబంధించిన నెంబర్‌ ప్లేట్ సైతం నెట్టింట వైరల్ అవుతోంది. 

    ఫ్యాన్సీ నెంబర్ ఇదే!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ (Rolls Royce Car) కారును కొనుగోలు చేశారు. ఆ కారుకు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా రవాణాశాఖ ‘TG 09 C 2727’ నెంబర్‌ను కేటాయించింది. ఆ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ సెంట్రల్ జోన్ ఆఫీసుకు వచ్చారు. ఆయన రాకతో ఆఫీసులో సందడి నెలకొంది. అభిమానులు సెల్ఫీలు దిగారు. రవాణాశాఖ అధికారులు, సిబ్బంది సైతం కలిశారు. ఫొటోలు దిగారు. వాహన రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో వెళ్లిపోయారు.

    ఎన్నికోట్ల ఖర్చంటే!

    చరణ్‌ రోల్స్ రాయిస్ కారును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా చరణ్‌ ఏరి కోరి మరి ‘TG 09 C 2727’ ఫ్యాన్సీ నెంబర్‌ను కారుకు ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.10-20 లక్షల వరకూ రుసుము చెల్లించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పటికే చరణ్‌ దగ్గర చాలా కార్లే ఉన్నాయ్‌. ఇప్పుడు ఆ చెర్రీ గ్యారేజ్‌లోకి మరో కారు వచ్చి చేరింది. కాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా రోల్స్‌ రాయిస్‌ కారునే వినియోగిస్తున్నారు. అలాగే పలువురు సెలబ్రిటీస్‌ దగ్గర కూడా ఈ కారు ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కారుకి సంబంధించిన ఫ్యాన్సీ నెంబర్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

    రామ్‌చరణ్‌ అరుదైన ఘనత

    సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో రామ్‌చరణ్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. చరణ్‌తో పాటు ఆయన పెంపుడు శునకం ‘రైమ్‌’ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వీటికి సంబంధించిన కొలతలను సైతం మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ – 2 కూడా గతంలో తన పెంపుడు జంతువుతో మైనపు విగ్రహంగా కనిపించారు. ఆమె తర్వాత చరణ్‌ మాత్రమే తన పెట్‌ డాగ్‌తో మైనపు విగ్రహంగా కనిపించబోతున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా రామ్‌చరణ్‌ నిలిచాడు. ‘రైమ్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని మిళితం చేస్తూ ఈ విగ్రహం రూపుదిద్దుకోవడం ప్రత్యేకంగా భావిస్తున్నాను’ అని చరణ్‌ అన్నారు.

    రికార్డు ధరకు ఓటీటీ హక్కులు!

    రామ్‌చరణ్‌ లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version