Ramayana: ‘రామాయణం’ టీమ్‌ నుంచి డబుల్‌ ట్రీట్‌.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ramayana: ‘రామాయణం’ టీమ్‌ నుంచి డబుల్‌ ట్రీట్‌.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!

    Ramayana: ‘రామాయణం’ టీమ్‌ నుంచి డబుల్‌ ట్రీట్‌.. ఆ రెండు పండగలకు సిద్ధంగా ఉండండి!

    November 6, 2024

    రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూట్‌ మెుదలవ్వగా సెట్‌ నుంచి కొన్ని ఫోటోలు సైతం లీకయ్యాయి. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి కళ్లు చెదిరే అప్‌డేట్స్‌ను మూవీ టీమ్ అధికారికంగా అందించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    రెండు పార్ట్స్‌గా.. 

    ‘రామాయణ’ (Ramayana) చిత్రం బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్‌ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ మెుదలై చాలా రోజులు కావొస్తున్న ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఫ్యాన్స్‌ తీవ్ర అంసతృప్తిలో ఉన్నారు. ఇది గమనించిన మూవీ టీమ్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. అంతేకాదు ఈ మూవీని రెండు పార్ట్స్‌గా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. రామాయణ ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి తీసుకొస్తున్నట్లు చెప్పింది. రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా తెలియజేసింది. 

    హనుమంతుడిగా సన్నీ డియోల్‌!

    ‘రామయణ’ (Ramayana) చిత్రంలో కన్నడ స్టార్ హీరో యష్‌ (Yash) రావణుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే అతడితో పాటు పలువురు స్టార్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం. ‌అలాగే హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సూర్పనక రోల్‌ చేస్తున్నట్లు తెలిసింది. హిందీ ‘రామాయణం’ సీరియల్‌లో రాముడిగా కనిపించి ఎంతో పాపులర్ అయిన సీనియర్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌ ఇందులో దశరథుడిగా కనిపించనున్నారు. అలాగే కైకేయిగా లారా దత్తా, లక్ష్మణుడిగా రవి దూబే, కౌసల్యగా ఇందిరా కృష్ణన్‌, మందరగా షీబా చద్దా చేయనున్నట్లు సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు రామయణ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.

    ఆస్కార్‌ విన్నర్లతో మ్యూజిక్‌

    ‘రామాయణ’ (Ramayana) చిత్రానికి సంగీతం అందించ‌డం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర‌్లు రంగంలోకి దిగారు. ఇందులో ఒక‌రు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కాగా ఇంకొక‌రు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్ద‌రూ క‌లిసి రామాయ‌ణం సినిమాకు సంగీతం అందించ‌నున్నారు. తొలుత ఈ సినిమాకు ఏ.ఆర్‌. రెహమాన్‌ను మాత్రమే మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. అయితే అంతర్జాతీయ స్టాండర్డ్స్‌లో మ్యూజిక్‌ ఉండాలన్న ఉద్దేశ్యంతో హన్స్‌ జిమ్మెర్‌ను సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యుడ్ని చేసినట్లు సమాచారం. ఇప్పటివరకూ హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పనిచేసిన హన్స్‌కు ‘రామాయణ’ ఫస్ట్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ కానుంది. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ వంటి హాలీవుడ్‌ చిత్రాల‌తో హన్స్ జిమ్మెర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించాడు.

    గ్రాఫిక్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

    ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై భారీగా విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్‌ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయన్న విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణ’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్‌ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం హాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన 26 మంది ఎక్స్‌పర్ట్ గ్రాఫిక్స్‌ టీమ్‌ వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం. దీన్ని బట్టి వీఎఫ్‌ఎక్స్ విషయంలో మూవీ టీమ్‌ ఏమాత్రం రాజీ పడటం లేదని అర్థమవుతోంది. 

    తెలుగు బాధ్యత త్రివిక్రమ్‌దే!

    రామాయణ (Ramayana) తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)కు మేకర్స్‌ అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా త్రివిక్రమ్ ఎక్కడా ఖండించలేదు. దీంతో ‘రామాయణ’ టీమ్‌లో మాటల మాంత్రికుడు సైతం భాగస్వామి అయినట్లు తెలుగు ప్రేక్షకులు నమ్ముతున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version