చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) నుంచి మరో సరికొత్త 5G ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదలైంది. ‘Realme 11 5G’ పేరుతో ఈ అధునాతన ఫోన్‌ను లాంఛ్ చేశారు. వియత్నం, తైవాన్ సహా పలు దేశాల్లో ఆగస్టు 1న ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో ‘రియల్‌మీ 11 5G’ ప్రత్యేకతలు ఏంటీ?. ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? భారత్‌లో దీని ధర ఎలా ఉండనుంది? కెమెరా క్వాలిటీ, బ్యాటరీ, స్టోరేజీ సామర్థ్యం వంటి కీలక అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ స్క్రీన్
Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.72 అంగుళాల Full HD+ స్క్రీన్‌తో తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటును అందించారు. అలాగే 680nits బ్రైట్‌నెస్, 240Hz టచ్ శాంపిలింగ్ రేట్, MediaTek Dimensity 6100, G57 MC2 GPU ఈ ఫోన్‌లో ఫిక్స్ చేశారు. Realme UI 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ చేస్తుంది.
స్టోరేజ్ సామర్థ్యం
Realme 11 5G ఫోన్‌కు 8GB RAM అమర్చారు. దీంతో ఈ ఫోన్ చాాలా వేగంగా పనిచేస్తుంది. అలాగే 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని ఫోన్‌కు ఇచ్చారు. microSD కార్డు సాయంతో ఈ స్టోరేజ్‌ను ఎంతవరకైనా పెంచుకోవచ్చు.
బిగ్ బ్యాటరీ
Realme 11 5G స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండటంతో పాటు.. వేగంగా ఫోన్‌ను ఛార్జ్ చేసుకునే వీలు కలుగుతుంది.
కెమెరా క్వాలిటీ
Realme 11 5G ఫోన్‌లో కెమెరానే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ మెుబైల్ వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 108MP Samsung ISOCELL HM6 ప్రైమరి, 2MP డెప్త్ షూటర్ కెమెరాలను ఫోన్‌కు అమర్చారు. వీటి సాయంతో అత్యంత నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వైపు 16MP సెల్ఫీ కెమెరా ఫిక్స్ చేశారు.
5G సపోర్ట్
ఈ ఫోన్ పేరును బట్టే ఇది 5Gకి సపోర్టు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే WiFi, Bluetooth, NFC, GPS, USB వంటి కనెక్టింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కలర్స్
ప్రస్తుతం Realme 11 5G ఫోన్‌ను రెండు రంగుల్లో మాత్రమే రిలీజ్ చేశారు. డాన్ గోల్డ్, మూన్ నైట్ డార్క్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
రియల్ 11 5G ఫోన్ భారత్‌లో ఎలాంటి ధరను కలిగి ఉంటుందో స్పష్టత లేదు. దీనిపై రియల్‌మీ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే వియత్నాంలో ఈ ఫోన్‌ను రూ.23,400కు విక్రయిస్తున్నారు. భారత్‌లోనూ ఈ ఫోన్ ధర రూ.20-25 వేల మధ్య ఉండొచ్చని అంచనా.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?