ప్రముఖ చైనీస్ మెుబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్, మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లలో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme 12+ 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఫిబ్రవరి 29న ఈ ఫోన్ భారత్‌లో లాంచ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు లీకయ్యాయి. పలు టెక్ వెబ్‌సైట్స్ వాటి గురించి ప్రస్తావించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ నయా రియల్‌మీ ఫోన్ 6.7 అంగుళాల Full HD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి 2,400 x 1,080 పిక్సెల్ క్వాలిటీని కూడా అందించినట్లు తెలిసింది. అలాగే MediaTek Dimensity 1080 SoC ప్రొసెసర్, ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ మెుబైల్ వర్క్ చేయనున్నట్లు సమాచారం.
ర్యామ్ & స్టోరేజ్
Realme 12+ 5G మెుబైల్.. నాలుగు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 6GB RAM/128GB, 8GB RAM/256GB, 12GB RAM/512GB, 16GB RAM/1TB వేరియంట్లలో ఇది అందుబాటులోకి రావొచ్చని టెక్ వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి.
ఫోన్ బ్యాటరీ
ఈ ఫోన్‌ను శక్తివంతమైన బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. 19 నిమిషాల్లోనే 1-50 శాతం ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటు ఉండనుంది.
కెమెరా క్వాలిటీ
ఈ Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్.. ట్రిపుల్ రియర్ కెెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మ్యాక్రో షూటర్‌ను కలిగి ఉండనున్నట్లు సమాచారం. ఇక సెల్ఫీలు, వీడియో కాల్ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేస్తారని కొన్ని టెక్ వెబ్‌సైట్స్ పేర్కొన్నాయి. నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఈ కెమెరా సెటప్ సహకరిస్తుందని చెప్పాయి.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ మెుబైల్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేయనుంది. అలాగే Wi-Fi 802.11 a/b/g/n/ac/6, Bluetooth 5.2, GPS, GLONASS, GALILEO, BDS, QZSS, USB Type-C 2.0 కనెక్టివిటీ ఫీచర్లతో ఇది రానున్నట్లు సమాచారం.
అడ్వాన్స్‌డ్ సెన్సార్లు
ఈ రియల్‌మీ ఫోన్ అడ్వాన్స్‌డ్ సెన్సార్ ఫీచర్లతో వస్తున్నట్లు లీకైనా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ (Under display Fingerprint), యాక్సిలోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ, ఈ-దిక్సూచి వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
Realme 12+ 5G మెుబైల్‌కు సంబంధించి కంపెనీ ఓ టీజర్‌ను లాంచ్ చేసింది. అందులో ఈ ఫోన్ గ్రీన్ కలర్‌లో కనిపించింది. దాన్ని బట్టి ఈ మెుబైల్ ఆ కలర్‌లోనే వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన కలర్ ఆప్షన్స్ గురించి లాంచింగ్ రోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ధర ఎంతంటే?
Realme 12+ 5G ఫోన్ ధరపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.25,000-30,000ల మధ్య ఉండే అవకాశమున్నట్లు టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మెుబైల్ ధరపై త్వరలోనే స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!