Realme Pad 2: సరికొత్త ఫీచర్స్‌తో రియల్‌మీ ప్యాడ్‌ 2 రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ అదుర్స్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme Pad 2: సరికొత్త ఫీచర్స్‌తో రియల్‌మీ ప్యాడ్‌ 2 రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ అదుర్స్!

    Realme Pad 2: సరికొత్త ఫీచర్స్‌తో రియల్‌మీ ప్యాడ్‌ 2 రిలీజ్.. ధర, స్పెసిఫికేషన్స్ అదుర్స్!

    September 13, 2023

    రియల్‌మీ గ్యాడ్జెట్స్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్ మీ ప్యాడ్ 2 (Realme Pad 2) ఇండియన్‌ మార్క్‌ట్‌లోకి బుధవారం మధ్యాహ్నం విడుదలైంది. సరికొత్త ఫీచర్స్‌తో ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ దీనిని మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చింది. గతంలోని ప్యాడ్ కన్నా ఈసారి బ్యాటరీ బ్యాకప్, డిస్‌ప్లే స్క్రీన్ క్వాలిటీ మెరుగైందని కంపెనీ తెలిపింది.  8,360mAh బ్యాటరీ, 2K స్క్రీన్‌ రెజల్యూషన్‌తో  రియల్‌మీ ప్యాడ్‌ 2 సగర్వంగా మార్కెట్లోకి వచ్చింది. మరి దీని ధర, ఇతర ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..

    రియల్‌మీ ప్యాడ్‌ 2 ధర

    రియల్‌మీ ప్యాడ్‌ 2 (Realme Pad 2) రెండు వేరియంట్లలో లభిస్తోంది. బేసిక్ వేరియంట్ 6GB+128GB వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8GB+256GB వేరియంట్‌ ఖరీదు రూ.22,999గా రియల్‌మీ కంపెనీ ప్రకటించింది. 

    కలర్స్

    రియల్‌మీ ప్యాడ్‌2 రెండు కలర్ వేరియంట్లలో అయితే అందుబాటులో ఉంది. ఇన్‌స్పిరేషన్‌ గ్రీన్‌, ఇమాజినేషన్‌ గ్రే కలర్స్‌లో ప్యాడ్‌ 2 లభిస్తోంది. ఇన్‌స్పిరేషన్ గ్రీన్ కలర్ గ్యాడ్జెట్‌కు ప్రిమియం లుక్‌ అయితే అందిస్తుంది. ఎక్కువగా ఈ కలర్ ప్యాడ్‌కు డిమాండ్ అధికంగా ఉండే ఛాన్స్ ఉంది.

    డిస్‌ప్లే ఫీచర్స్

    రియల్‌మీ ప్యాడ్ 2 స్క్రీన్ టూ బాడీ రేషియో 85.2% కలిగి ఉండటం వల్ల బిగ్ స్క్రీన్‌లో చూసిన అనుభూతి కలుగుతుంది. 11.5 అంగుళాల లార్జ్ IPS డిస్‌ప్లే 2K స్క్రీన్‌తో వస్తోంది. డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేటింగ్‌ కలిగి  మంచి పిక్చర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దీనితో పాటు 2000*1200 స్క్రీన్ రెజల్యూషన్, 1బిలయన్ స్క్రీన్ కలర్స్, బ్లూ లైట్ ప్రొటెక్షన్,  450nits వరకు బ్రైట్‌నెస్‌ను అయితే డిస్‌ప్లే కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. గతంలో ప్యాడ్ 1 స్క్రీన్ సైజ్ 26Cm ఉంటే అది ప్యాడ్‌ 2లో 29CMకి పెరిగింది. స్క్రీన్ బాడీ రెషియో 82%- 85.2% పెరిగింది.

    బ్యాటరీ

    రియల్‌మీ ప్యాడ్2 బిగ్ బ్యాటరీ బ్యాకప్‌తో అయితే వస్తోంది. 8,360mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న  ప్యాడ్‌ 2..  33W సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 50శాతం ఛార్జ్ కావడానికి 52 నిమిషాలు సమయం పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకు గ్యాడ్జెట్ వర్క్ చేస్తుంది.

    కెమెరా

    రియల్‌మీ ప్యాడ్‌2లో కెమెరా క్వాలిటీగా ఇచ్చారు.  ఇందులో 8MP మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు టెక్ట్స్‌ స్కానింగ్ సదుపాయం కల్పించారు. సెల్ఫీ కెమెరా 5MP మోడ్‌లో వచ్చింది.  17 గంటల వీడియో ప్లేబ్యాక్ 190 గంటల మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ టైమ్ గ్యాడ్జెట్ ఇస్తుందని రియల్‌మీ కంపెనీ పేర్కొంది.  నాలుగు స్టీరియో స్పీకర్స్ డాల్బీ ఆటమ్స్ కలిగి మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.  

    సాఫ్ట్‌వేర్:

    ఈ గ్యాడ్జెట్ Realme UI 4.0పై ఆధారపడి ఆండ్రాయిడ్ 13పై రన్‌ అవుతుంది. MediaTek Helio G99 SoC పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను రియల్‌మీ ప్యాడ్ 2 కలిగి ఉంది. మల్టీ స్క్రీన్‌, స్క్రీన్ మిర్రరింగ్, డ్యుయల్‌ విండోస్‌, స్ల్పిట్ స్క్రీన్‌, స్మార్ట్ స్లైడ్‌బార్‌ వంటి ఫీచర్లు దీని అదనపు ప్రత్యేకతలు. ఈ నెల 26 నుంచి కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రీ బుకింగ్ ఆర్డర్లు మొదలవుతాయని కంపెనీ తెలిపింది. ఆగస్టు 1 నుంచి రియల్‌మీ వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

    ఆఫర్లు:

     రియల్‌మీ ప్యాడ్‌ 2పై పలు బ్యాంకుల క్రెడిట్ కార్డులపై రూ.1500-రూ.2000 వేల వరకు అయితే ఆఫర్లు ఉన్నాయి.  ప్రస్తుతానికి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.1500 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. సెల్స్‌కు వచ్చే సమయానికి మరిన్ని ఆఫర్లను వివిధ బ్యాంకులు ప్రకటించే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version