తాజాగా జరిగిన ఇండియన్ మైబైల్ కాంగ్రెస్ (IMC) 2024 కార్యక్రమంలో షియోమీ సంస్థ తన నూతన Redmi A4 5G హ్యాండ్‌సెట్‌ను ప్రదర్శించింది. షియోమీ ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరలో అంటే రూ. 10,000 కన్నా తక్కువ ధరలో భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఇది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 చిప్‌సెట్‌తో తయారైన తొలి ఎంట్రీ లెవల్ 5G హ్యాండ్‌సెట్ అవుతుందని కంపెనీ తెలిపింది.
రెడ్‌మి A4 5G: విడుదల తేదీ
షియోమీ కంపెనీ తమ అధికారిక సైట్‌లో ఈ హ్యాండ్‌సెట్ గురించి టీజ్ చేస్తోంది. అమెజాన్‌లో కూడా ల్యాండింగ్ పేజీ లైవ్ చేయబడింది. దీని ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, కొన్ని ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి రానుందని సమాచారం.
Redmi India అధికారిక X ఖాతా ద్వారా Redmi A4 5G నవంబర్ 20న భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు పోస్ట్ చేసింది. హాలో గ్లాస్ డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్ని రంగులలో అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
రెడ్‌మి A4 5G స్పెసిఫికేషన్లు
- డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్ 6.88 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది, దీని రిఫ్రెష్ రేట్ 120Hz.
- చిప్‌సెట్: షియోమీ తెలిపినట్లుగా, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఈ హ్యాండ్‌సెట్ అండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS 1.0తో నడుస్తుంది.
బ్యాటరీ- ఛార్జింగ్ సామర్థ్యం
రెడ్‌మి A4 5G బ్యాటరీ పరంగా కూడా బాగా మెరుగైనది. 5160mAh కెపాసిటీతో వస్తున్న ఈ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. USB-C ఛార్జింగ్ పోర్టుతో త్వరగా ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
కెమెరా విభాగం
ఈ హ్యాండ్‌సెట్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా 50MP రెసొల్యూషన్ కలిగి ఉండి f/1.8 అపెర్చర్‌తో వస్తుంది. సెకండరీ కెమెరా వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది.
తక్కువ ధరకే
షియోమీ ఈ ఫోన్‌ను రూ.10,000 కన్నా తక్కువ ధరలోనే విడుదల చేయబోతున్నట్లు ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ప్రకటించింది. అయినప్పటికీ, ఖచ్చితమైన ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఈ విధంగా Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది. కొత్తగా తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫొన్ కొనాలనుకునే వారికి ఈ ఫొన్ మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2 Record: రిలీజ్‌కు ముందే ‘పుష్ప 2’ ఆల్‌టైమ్ రికార్డు.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాల్సిందే!