చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ రెడ్‌మీ (Redmi) నుంచి ఏ మెుబైల్ రిలీజైన అది టెక్ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన ఫోన్లను రెడ్‌మీ లాంచ్ చేస్తుండటమే దీనికి కారణం. ఇదిలా ఉంటే మెుబైల్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘Redmi K70 Series’ విడుదలకు సిద్ధమైంది. ‘Redmi K60 Series’కు కొనసాగింపుగా వస్తున్న ఈ నయా మెుబైల్ నవంబర్ 29న చైనాలో విడుదల కానుంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన టీజర్ ద్వారా ‘Redmi K70 Series’ కు సంబంధించిన ఫీచర్లు బయటకు వచ్చాయి. అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మూడు వేరియంట్లలో లాంచ్
Redmi K70 Series మెుత్తం మూడు వేరియంట్లలో లాంచ్ కానుంది. రెడ్‌మీ కే70 (Redmi K70), రెడ్‌మీ కే70 ప్రో (Redmi K70 Pro), రెడ్‌మీ కే70ఈ (Redmi K70 E) మోడల్స్‌లో ఇవి రాబోతున్నాయి. ఈ మూడు ఫోన్లు ఒకే తరహా డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఆన్‌లైన్‌లో లీకైన ఫోటోల ప్రకారం.. ఫోన్ స్క్రీన్ చుట్టూ స్లిమ్ బెజెల్స్, సెల్ఫీ షూటర్, ఫ్లాట్ ఎడ్జ్‌ల కోసం సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్‌తో ఫోన్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెుబైల్స్‌కు ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు. ఇక మోడల్స్ వారీగా లీకైన ఫీచర్లను కింద పరిశీలిద్దాం.
Redmi K70 Pro ఫీచర్లు
Redmi K70 Pro మెుబైల్.. 6.67 అంగుళాల స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. Snapdragon 8 Gen 3 SoC ప్రొసెసర్‌తో ఇది పనిచేస్తుందట. ఈ మెుబైల్‌లో సెల్ఫ్ ice-cooling systemను అమర్చినట్లు రెడ్‌మీ వెల్లడించింది. ఇక ఈ మోడల్‌ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రెడ్‌మీ తీసుకొస్తున్నట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. 50MP OIS ప్రైమరీ కెమెరా 2x optical zoomతో వస్తోంది.
Redmi K70E స్పెసిఫికేషన్స్
ఈ మెుబైల్ 1.5K డిస్‌ప్లేతో రాబోతున్నట్లు ఇప్పటికే రెడ్‌మీ స్పష్టం చేసింది. MediaTek Dimensity 8300-Ultra SoC ప్రొసెసర్‌తో ఇది రన్ అవుతుందని ప్రకటించింది. ఈ మెుబైల్ స్క్రీన్‌కు 1,800nits పీక్ బ్రైట్‌నెస్ అందించినట్లు సమాచారం. అలాగే ఈ ఫోన్‌లో 1,920Hz హై-ఫ్రీక్వెన్సీ PWM dimming రేట్, Xiaomi HyperOS, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేసే 5,500mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Redmi K70 ఫీచర్లు
ఈ మెుబైల్‌ను కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నట్లు రెడ్‌మీ ప్రకటించింది. MediaTek Dimensity 8300 SoC ప్రొసెసర్ పైనే ఇది కూడా పని చేస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక Redmi K70 సహా.. ఈ సిరీస్‌లోని ఫోన్లు అన్ని 12GB RAM + 256GB ROM, 16GB RAM + 256GB ROM, 24GB RAM + 512GB ROM ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
ధర ఎంతంటే?
నవంబర్ 29 సాయంత్రం 4:30కు ఈ నయా రెడ్‌మీ మెుబైల్స్ విడుదలవుతాయి. ఆ రోజు మరిన్ని ఫీచర్లతో పాటు మెుబైల్స్ ధరపై స్పష్టత వస్తుంది. అయితే Redmi K70 Pro వేరియంట్ ప్రారంభ ధర రూ.43,990 వరకూ ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన వేరియంట్ల ధరలు కూడా అటు ఇటుగా రూ.40 వేలకు పైనే ఉంటాయని అభిప్రాయపడుతున్నాయి.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం