దేశంలో మంచి బ్రాండ్ కలిగిన మెుబైల్ కంపెనీల్లో రెడ్‌మీ ఒకటి. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే ఫోన్లతో పాటు అడ్వాన్స్‌డ్ స్మార్ట్‌వాచ్‌లకు మంచి డిమాండ్ అయితే ఉంటుంది. త్వరలో ఈ కంపెనీ Redmi Watch 4 పేరుతో కొత్త స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేయనుంది. నవంబర్ 29న Redmi K70 స్మార్ట్ ఫోన్‌తో పాటు ఈ వాచ్‌ను చైనాలో ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో వాచ్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
వాచ్ స్క్రీన్
ఈ స్మార్ట్‌వాచ్ 1.97 అంగుళాల డైమండ్ కట్ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. 60 హెడ్జ్ రిఫ్రెష్ రేటుతో 600nits పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. వాచ్‌స్క్రీన్‌లో LTPS టెక్నాలజీ ఉపయోగించారు. ఇది స్క్రీన్ టైమింగ్‌ను తగ్గించడంలో సాయపడుతుంది. వాచ్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు అల్యూమినియం మెటల్‌తో వాచ్ హెడ్‌ను తయారు చేశారు. స్టెయిన్ లెస్ స్టీల్‌తో క్రౌన్‌కు అట్రాక్టివ్ ఫినిషింగ్ అందించారు.
హెల్త్ ఫీచర్లు
ఈ వాచ్‌లో అడ్వాన్స్‌డ్ హెల్త్ ఫీచర్లను రెడ్‌మీ ఇన్‌బిల్ట్ చేసింది. హృదయ స్పందనలను గుర్తించే ‘హార్ట్ రేట్ మానిటర్’, రక్తంలో ఆక్సిజన్ స్థాయులను కొలిచే ‘బ్లడ్ ఆక్సిజన్ మానిటర్'(SPO2), స్లీపింగ్ రేట్ మానిటర్ వంటి ఆధునాతన ఫీచర్లు ఇందులో తీసుకొచ్చారు.
స్పోర్ట్స్ మోడ్స్
ఈ నయా రెడ్‌మీ 4 వాచ్‌లో 200కి పైగా వాచ్ ఫెసెస్ ఉన్నాయి. వ్యక్తిగత అభిరుచి, స్టైల్ మేరకు దేనినైనా ఉపయోగించుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో వెరైటీ స్పోర్ట్స్ మోడ్స్‌ను అందుబాటులో ఉంచారు. వాటి ద్వారా రోజు వారి వ్యాయామాన్ని అనుకూలమైన పద్దతిలో ఎంచుకోవచ్చు.
బ్యాటరీ లైఫ్
10 రోజుల వరకు ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ అందిస్తుందని రెడ్‌మీ కంపెనీ క్లెయిమ్ చేసింది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు 1 గంట వరకు సమయం పట్టనుంది.
అడ్వాన్స్‌డ్ సెన్సార్లు
ఈ వాచ్ ప్రధానంగా GPS వెర్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఇది ప్రధానంగా నావిగేషన్‌లో సహాయపడును. వీటితో పాటు ఫైండ్ మై ఫోన్, వెదర్ రిపోర్ట్, కేలరీ కౌంటర్ వంటి ఫీచర్లతో పాటు, 5ATM వాటర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉండనుంది.
కలర్ వేరియంట్లు
రెడ్‌మీ వాచ్ 4 వాచ్ కేస్ ప్రధానంగా ఐవరీ, బ్లాక్, బ్లూ కలర్స్‌లో వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ వాచ్ మొత్తం నాలుగు రకాల రిస్ట్‌బ్యాండ్‌లతో వస్తున్నట్లు స్పష్టత ఉంది. మెటల్, లెదర్, ఫాబ్రిక్, TPU వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
ధర ఎంతంటే?
ప్రస్తుతం ఈ కొత్త వాచ్ చైనాలో మాత్రమే విడుదల కానుంది. త్వరలోనే భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. దీని ధరపై ఇంకా స్పష్టత లేదు. అయితే దీని ధర రూ.4,999- రూ. 5,999 మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్