Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?

    Review: విశ్వక్‌సేన్ ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా?

    March 22, 2023

    విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం మార్చి 22 థియేటర్లలో విడుదలైంది. ప్రచార చిత్రాలు, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, విశ్వక్‌సేన్ హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా, యాక్టర్‌గా విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా ప్రేక్షకుడిని మెప్పించిందా? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం. 

    దర్శకుడు: విశ్వక్‌సేన్ 

    నటీ నటులు: విశ్వక్‌సేన్, నివేథా పెతురాజ్, రావు రమేశ్, రోహిణి, తదితరులు

    సంగీతం: లియోన్ జేమ్స్

    సినిమాటోగ్రఫీ: దినేష్ కె బాబు, జార్జ్ విలియమ్స్

    కథేంటి?

    కృష్ణ దాస్(విశ్వక్‌సేన్) ఒక అనాథ. ఓ ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి రిచ్‌గా బతకాలని కలలు కంటుంటాడు. వెయిటర్‌గా చేస్తున్న సమయంలోనే కీర్తి(నివేథా పెతురాజ్)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, సంజయ్ రుద్ర(విశ్వక్‌సేన్) ఓ ఫార్మా కంపెనీని నడిపే సీఈవో. అనుకోని కారణాల వల్ల సంజయ్ జీవితంలోకి కృష్ణదాస్ ప్రవేశించాల్సి వస్తోంది. అయితే, సంజయ్‌గా దాస్ ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? సంజయ్, దాస్‌లకు మధ్య ఏమైనా సంబంధం ఉందా? చివరికి వీరిద్దరూ కలుసుకున్నారా? అనేది తెరపై చూడాల్సిందే. 

    ఎలా ఉంది? 

    అందరికీ తెలిసిన ఫార్ములానే కావడంతో కథలో కొత్తదనం కనిపించలేదు. ఫస్టాఫ్‌లో కామెడీ సన్నివేశాలు కాస్త నవ్వించాయి. నివేదాతో లవ్ ట్రాక్ మరీ అంతగా ఆకట్టుకోలేదు. మొత్తానికి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్ధంలో తొలి పది నిమిషాలు అది కొనసాగుతుంది. ఆ తర్వాత సినిమాలో ట్విస్టులు రావడం మొదలవుతాయి. అయితే, కథలో అవసరమైన వాటికన్నా ఎక్కువ ట్విస్టులు ఉండటం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని ట్విస్టులను ప్రేక్షకులు ఊహిస్తారు. ఎమోషనల్ సీన్స్‌ మరింత మెరుగ్గా ఉండాల్సింది. క్లైమాక్స్‌లో సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. 

    ఎవరెలా చేశారు? 

    విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్‌లో అలరించాడు. తనలోని భిన్న కోణాలను చూపించడానికి ఈ రెండు పాత్రలు బాగా ఉపయోగపడ్డాయి. నటన పరంగా విశ్వక్‌ ఆకట్టుకున్నాడు. బోల్డ్ డైలాగ్‌లతో మాస్ ఆడియెన్స్‌ని మురిపించాడు. నివేదా పేతురాజ్ అందంగా కనిపించింది. రావు రమేశ్, రోహిణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మహేశ్, హైపర్ ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ మెప్పించాడు. 

    టెక్నికల్‌గా

    సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. సెకండాఫ్‌లో స్టోరీని నడిపించడానికి విశ్వక్‌ బాగానే శ్రమించాడు. తనలోని డైరెక్టర్‌కు పనిచెప్పాడు. ఇక లియోన్ జేమ్స్ అందించిన సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలం చేకూర్చింది. ముఖ్యంగా ‘మావా బ్రో’, ‘ఆల్మోస్ట్ పడిపోయానే పిల్లా’ పాటలు తెరపై సందడి చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ప్లస్ పాయింట్స్

    విశ్వక్‌సేన్ నటన

    సంగీతం

    నిర్మాణ విలువలు

    మైనస్ పాయింట్స్

    ఎక్కువ ట్విస్టులు

    స్క్రీన్ ప్లే

    ఫైనల్‌గా.. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న దాస్‌.. క్లాస్ ప్రేక్షకులకు ధమ్కీ ఇచ్చాడు.

    రేటింగ్: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version