REVIEW: కృష్ణ వంశీ మార్క్‌ భావోద్వేగాలతో నిండిన ‘రంగమార్తాండ’
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • REVIEW: కృష్ణ వంశీ మార్క్‌ భావోద్వేగాలతో నిండిన ‘రంగమార్తాండ’

    REVIEW: కృష్ణ వంశీ మార్క్‌ భావోద్వేగాలతో నిండిన ‘రంగమార్తాండ’

    March 21, 2023

    కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కృష్ణ వంశీ. కొద్దిరోజులుగా హిట్ చిత్రాలు తీయకపోయినా తన మార్క్‌ ఎవ్వరూ మర్చిపోలేదు. వంశీ ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాను తెరకెక్కించాడు. ఉగాది రోజున సినిమా విడుదలవుతున్నప్పటికీ ప్రీమియర్‌ షోలు వేశారు. మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తీసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? కృష్ణ వంశీ సక్సెస్ బాట పట్టాడా? అనేది చూద్దాం.

    దర్శకుడు: కృష్ణవంశీ 

    నటీ నటులు: ప్రకాశ్ రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, తదితరులు

    సంగీతం: ఇళయ రాజా

    సినిమాటోగ్రఫీ: రాజ్‌.కె. నళ్లీ

    కథేంటీ?

    రంగస్థల నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాఘవరావు ( ప్రకాశ్ రాజ్‌). అతడి నటనకు మెచ్చి రంగమార్తాండ అనే బిరుదును ఇస్తారు. ఆ బిరుదుతోనే నాటకరంగం నుంచి తప్పుకొని ఆస్తిని పిల్లలకు పంచుతాడు. వారితో సంతోషమైన జీవితం గడుపుదామని భావించిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. రాఘవరావు స్నేహితుడు చక్రవర్తి ( బ్రహ్మానందం ) పాత్ర ఏమిటి? అనేది కథ. 

    ఎలా ఉందంటే?

    రాఘవరావు, చక్రవర్తి పాత్రలతో కథను ఆరంభించిన దర్శకుడు రంగమార్తాండ బిరుదు తీసుకొని నాటకాలకు స్వస్థి పలికిన వ్యక్తి పాత్రలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. కోడలికి ఆస్తి పంచి, కుమార్తెకు ప్రేమించిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసి తన బాధ్యతలు నిర్వర్తించిన పెద్దమనిషి సాధారణమైన జీవితాన్ని చూపించాడు. 

    ఆనందంగా గడుపుదామనుకున్న వ్యక్తికి కోడలు పెట్టే అవమానాలు, కూతురు ఇంటికి వెళ్లిన అతడికి ఎదురయ్యే పరిణామాలు దిక్కుతోచని స్థితిలో పడేస్తాయి.కుటుంబ విలువలను చక్కగా చూపించే కృష్ణవంశీ తన దర్శకత్వ ప్రతిభను మరోసారి చూపించాడు. 

    మరాఠీ చిత్రం నటసామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా మార్చాడు వంశీ. తెలుగు నాటకరంగం ఎంత గొప్పదో వివరించే సన్నివేశాలు అదిరిపోతాయి. 

    ఎవరెలా చేశారంటే?

    నటనతో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌ ఈ సినిమాతో శిఖరాన్ని చేరుకున్నాడు. రాఘవపాత్రకు ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరంటే అతిశయోక్తి కాదు. 

    పంచతంత్రం సినిమాతో రూటు మార్చిన బ్రహ్మానందం భావోద్వేగపూరితమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఆయనలో సరికొత్త కోణం కనిపిస్తుంది. భర్త చాటు భార్యగా కేవలం కళ్లతోనే హావాభావాలు పలికించే పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. 

    రాఘవరావు కోడలి పాత్రలో అనసూయ, కుమార్తెగా శివాత్మిక, మిగిలిన పాత్రల్లో నటించిన రాహుల్ సిప్లిగంజ్, అలీ రాజా, ఆదర్శ్ వారి రోల్స్‌కు పూర్తిగా న్యాయం చేశారు. ఈ తరం యువత ఎలా ఉంటారనే కోణంలో మెప్పించారు.

    సాంకేతికత విలువలు

    రంగమార్తాండ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు కృష్ణవంశీ. ఈ చిత్రంలో తన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుత యువత, తల్లిదండ్రుల మధ్య సంఘర్షణను చూపించండంలో విజయం సాధించాడు . 

    సినిమాకు మరో పిల్లర్ సంగీతం. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అందించిన వినసొంపైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. 

    ఇక్కడ మరోవ్యక్తి గురించి చెప్పుకోవాల్సిందే. ఆకెళ్ళ శివ ప్రసాద్ మాటలు సినిమాకు ప్రధాన బలం. సినిమాలపై అతడికి ఉన్న అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది. 

    బలాలు

    నటీనటులు

    దర్శకత్వం

    సంగీతం

    మాటలు

    బలహీనతలు

    తారాబలం లేకపోవటం

    రేటింగ్: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version