ఈ సంవత్సరం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అనేక సంస్థలు పోటీపడి తమ ప్రత్యేక ఫోన్‌లను విడుదల చేశాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం వేరియంట్ల వరకు విస్తృత శ్రేణి ఫోన్‌లు లభ్యమయ్యాయి. భారతదేశం, ఒక ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా, అన్ని ధరల విభాగాల్లో మంచి డిమాండ్ కలిగి ఉంది. శాంసంగ్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలతోపాటు వివో, ఐకూ, ఒప్పో సంస్థలు తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైస్‌లను విడుదల చేశాయి.
2024లో లాంచ్ అయిన కీలక స్మార్ట్‌ఫోన్‌లు
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా (Samsung Galaxy S24 Ultra) ఫోన్ 6.8 అంగుళాల QHD+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ పైన పనిచేస్తున్న ఈ ఫోన్ కెమెరా విభాగంలో 200MP ప్రధాన కెమెరాతో పాటు 12MP, 50MP, 10MP కెమెరాలను కలిగి ఉంది. 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
- స్టోరేజి వేరియంట్లు: 256GB, 512GB, 1TB
- బ్యాటరీ: 5000mAh
- ధర: రూ.96,490 నుంచి
- రంగులు: వైలెట్, గ్రే, బ్లాక్, టైటానియం యెల్లో
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్
ఆపిల్ సంస్థ తన ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (iPhone 16 Pro Max)ను లాంచ్ చేసింది. ఇది 6.9 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో వస్తోంది. 3nm A18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తున్న ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4685mAh.
- కెమెరాలు: 48MP + 48MP + 12MP రియర్ కెమెరాలు, 12MP సెల్ఫీ కెమెరా
- ధర: రూ.1,44,900
- స్టోరేజి: 256GB
గూగుల్ పిక్సల్ 9 ప్రో XL
గూగుల్ తన పిక్సల్ 9 సిరీస్‌లో భాగంగా పిక్సల్ 9 ప్రో XL (Google Pixel 9 Pro XL)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ 6.8 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. గూగుల్ టెన్సార్ G4 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది.
- కెమెరాలు: 50MP + 48MP + 48MP రియర్ కెమెరాలు, 42MP సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 5060mAh
- ధర: రూ.1,24,999
- స్టోరేజి వేరియంట్లు: 256GB, 512GB
ఒప్పో ఫైండ్ X8 ప్రో
ఒప్పో తన ఫైండ్ X8 ప్రో (Oppo Find X8 Pro) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
- కెమెరాలు: 50MP + 50MP + 50MP ట్రిపుల్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 5910mAh
- ధర: రూ.99,999
- ర్యామ్/స్టోరేజి: 16GB ర్యామ్ + 512GB స్టోరేజి
వివో X200 ప్రో
వివో తన X200 సిరీస్‌లో భాగంగా X200 ప్రో (Vivo X200 Pro) ఫోన్‌ను విడుదల చేసింది. 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ LTPO OLED డిస్‌ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌తో పనిచేస్తోంది.
- కెమెరాలు: 50MP + 200MP + 50MP రియర్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా
- చార్జింగ్: 90W ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్‌లెస్ చార్జింగ్
- ధర: రూ.94,999
ఐకూ 13 5G
ఐకూ సంస్థ తన 13 5G (iQOO 13 5G) మోడల్‌ను 6.82 అంగుళాల 2K LTPO అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
- కెమెరాలు: 50MP + 50MP + 50MP రియర్ కెమెరాలు, 32MP సెల్ఫీ కెమెరా
- బ్యాటరీ: 6000mAh
- ధర: రూ.54,999 (12GB ర్యామ్), రూ.59,999 (16GB ర్యామ్)
కాస్త ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఇవి అందించే ఫీచర్లు.. వినియోగదారులకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయని చెప్పవచ్చు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి