RRR సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అటువంటి RRR సినిమా గురించి కొంత మంది హలీవుడ్ ప్రేక్షకులు ఇదో గే స్టోరీ అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. నా అంచనాలు నిజమయ్యాయని తాను కూడా మొదట RRR సినిమాను చూసి గే స్టోరీనే అనుకున్నానని తెలిపారు. ఈ సినిమా మీద కొంత మంది హాలీవుడ్ ఫ్యాన్స్ చేసిన కామెంట్లను వివరిస్తూ రాసిన కథనాన్ని ఆయన ట్వీట్ కు జోడించారు. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ మూవీని స్వలింగసంపర్కుల మూవీలానే భావించారని.. మొదట తాను కూడా ఈ మూవీని అలానే భావించానని తెలిపారు.
ఈ సినిమాలో యంగ్ హీరోలు రామ్ చరణ్ సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీంగా నటించారు. వీరి నటనకు, దర్శకుడు రాజమౌలి టేకింగ్‌కు యావత్తు సినీ లోకం జేజేలు పలికింది. కానీ కొంత మంది మాత్రం ఇది గే స్టోరీ అంటూ కామెంట్లు చేశారు. హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి వారు అలా అనుకొని ఉంటారు. RGV ఈ కామెంట్లు చేయడంతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక యూజర్ మీరు వోడ్కా తాగి సినిమా చూశారా అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఒక యూజర్ కామెంట్ చేస్తూ స్నేహాన్ని కూడా గే స్టోరీ అనుకున్నారంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతోందని,RGV కూడా అలాంటి వాడే అని కామెంట్ చేశాడు.ఈ ట్వీట్లపై మూవీ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?