RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!

    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!

    April 6, 2024

    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్‌ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్‌ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్‌ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు.

    ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయని వాటిలో 90% ఫెయిలవుతున్నట్లు ఆర్జీవీ చెప్పాడు. చిత్ర నిర్మాతలు ఎంచుకున్న కథ, తారాగణం, సృజనాత్మక అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోని 90% నిర్మాతలకు ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియదని ఈ లెక్కలు రుజువు చేస్తున్నట్లు చెప్పాడు.

    సినిమా తీయగల టాలెంట్ ఉన్న ఆడియన్స్‌కు మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కలిసి కట్టుగా నిర్మూలిద్దామంటూ వారికి పిలుపునిచ్చాడు. ఇండస్ట్రీలోని స్టార్ల వారసులని కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా కృషి చేద్దామని ఆర్జీవీ అన్నాడు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. అవి మీ సమయాన్ని, డబ్బుని వృథా చేస్తాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి వాటిని కూడా నిర్మూలించేందుకు చేతులు కలపాలని సినీ అభిమానులకు పిలుపునిచ్చాడు. 

    చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఆర్జీవీ డెన్‌ ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ టిక్కెట్‌ కొనుగోలు చేసే ప్రేక్షకులు మాత్రమే సినిమాను నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. లీడ్‌ యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, లిరికిస్ట్స్‌, డైలాగ్‌ రైటర్స్‌ను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర టెక్నికల్‌ సిబ్బందిని పరిశ్రమలోని నిపుణుల నుండి ఎంపిక చేసిన దర్శకుడు సెలక్ట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. 

    అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందామని ఔత్సాహికులకు ఆర్జీవీ పిలుపునిచ్చాడు. వారందర్ని ఆర్జీవీ డెన్‌కి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. మరి మీలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.comకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్‌ని తెలుసుకోవాలని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సూచించారు. 

    ఔత్సాహికులు ఏ విధంగా అప్లై చేయాలి? వచ్చిన ఆప్లికేషన్ల నుంచి నటీనటులను ఫైనల్‌ చేసే విధానాన్ని కూడా ఆర్జీవీ తన వెబ్‌సైట్‌లో వివరంగా పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. 

    1. పేరు 
    2. వయసు
    3. ఎత్తు (అడుగులలో)
    4. చర్మ రంగు
    5. కంటి రంగు
    6. సింగిల్ బస్ట్ సైజ్‌ ఫొటో
    7. సింగిల్‌ ఫుల్‌ ఫిగర్ ఫొటో
    హీరో, హీరోయిన్ ఎంపిక ప్రక్రియ

    ఆసక్తిగల వారు 15 రోజుల్లో పై వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 30 మందిని ఆర్జీవీ డెన్‌ సిబ్బంది లుక్స్‌ను బట్టి షార్ట్ లిస్ట్‌ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన 30 మంది వివరాలను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వారిలో ఎవర్ని ఎంచుకోవాలో పబ్లిక్‌  పోల్‌ నిర్వహిస్తారు. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్‌ 15 యువతీ, యువకులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని ఏదైన డైలాగ్‌ ఇచ్చి 30 సెకన్ల ఆడిషన్స్ వీడియో పంపాలని ఆర్జీవ్‌ డెన్‌ టీమ్‌ కోరుతుంది. మళ్లీ ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్టు చేసి మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ దఫా ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఏడుగురు యువతీ, యువకులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి నటనకు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్స్ పెట్టి వారిలో బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చిన వారిని తిరిగి పోల్‌లోకి తీసుకొస్తారు. అందులో టాప్‌లో నిలిచిన యువతీ యువకులను ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వారిని RGVDEN తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్‌గా అవకాశం ఇస్తారు.

    మిగతా విభాాగాలు..

    ఇదే విధంగా డైరెక్టర్స్‌, రైటర్స్‌, మ్యూజిక్ కంపోజర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌, లిరికిస్ట్స్‌ వారి విభాగాలకు తగ్గట్లు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి. 

    yourfilm-new
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version