భారత చిత్ర పరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ అనగానే ముందుగా అందరికీ ‘రామ్ గోపాల్ వర్మ’ (Ram Gopal Varma)నే గుర్తుకు వస్తారు. ‘శివ’ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆర్జీవీ (RGV).. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్జీవీ.. ఇప్పటివరకూ పదుల సంఖ్యలో చిత్రాలకు దర్శకత్వం వహించి, మరికొన్నింటిని నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రాల్లో నటించి చాలా మంది నటీమణులు స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. మరికొందరు తమ ఫేమ్‌ను మరింత పెంచుకున్నారు. ఆర్జీవీ చిత్రాల్లో చేసిన ఆ టాప్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆరాధ్య దేవి (Aaradhya Devi)
ఆర్జీవీ అప్‌కమింగ్ చిత్రం ‘చీర’లో శ్రీలక్ష్మీ సతీష్ (Shri Lakshmi Satish) నటించింది. ఇందులో ఆమె ఆరాధ్య దేవి పాత్ర పోషిస్తుండటంతో ఆ పేరునే తన పేరుగా మార్చుకుంది. గతేడాది చీరలో ఉన్న అమ్మడి ఫొటో చూసి ఆర్జీవీ ఇంప్రెస్ అయ్యారు. ఆమె అందానికి దాసోహం అయినట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమెతో ఏకంగా చీర అనే పేరుతో సినిమా తీసి ఆమె చేత అందాల ప్రదర్శన చేయించాడు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
Aaradhya Devi Hot images gallery
ఇర్రా మోర్ (Irra Mor)
ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘కొండ’ సినిమాతో నటి ఇర్రా మోర్ చాలా పాపులర్ అయ్యింది. అంతకుముందు ‘భైరవ గీత’, ‘డీ కంపెనీ’ వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ‘కొండ’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)
హాట్ బ్యూటీ శాన్వీ శ్రీవాస్తవ ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘రౌడీ’ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఇందులో మంచు విష్ణుకు జోడీగా నటించి మెప్పించింది. అంతకుముందు లవ్లీ, అడ్డా, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకు పెద్దగా పేరు రాలేదు. రౌడీలో ఈ భామ హోయలు చూసి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో శాన్వీ వరుసగా చిత్రాలు చేసింది.
Shanvi Srivastava Hot images gallery
పూజా భలేకర్ (Pooja Bhalekar)
హీరోయిన్ల అందాలను చూపించడంలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో శైలి ఉంటుంది. అలాగే ఆర్జీవీకి ఓ భిన్నమైన శైలి ఉంటుంది. వివిధ రకాల పొజిషన్‌లో కెమెరాను పెట్టి హీరోయిన్ అందాలను ఆర్జీవీ క్యాప్చర్ చేస్తుంటారు. ఇలా వచ్చిన చిత్రమే ‘లేడీ బ్రూస్‌లీ. వర్మ రూపొందించిన ఈ చిత్రంలో నటి పూజా భలేకర్ హాట్ బాంబ్‌లా చేసింది. తెరపై ఈ భామ అందాల విన్యాసాలకు కుర్రకారు ఫీదా అయ్యారు.
Pooja Bhalekar Bikini images gallery
నైనా గంగూలి (Naina Ganguly)
ఆర్జీవీ టాలెంటెడ్ హీరోయిన్లతో పాటు బోల్డ్ నటీమణులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన నటి నైనా గంగూలి. 2016లో వచ్చిన వంగవీటి సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. 2022లో వచ్చిన డేంజరస్ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయింది. గ్లామర్ షో చేసింది.
అప్సర రాణి (Apsara Rani)
ఆర్జీవీ చేతిలో పడి స్టార్‌గా మారిన మరో హాట్ బాంబ్ అప్సర రాణి. 2022లో వచ్చిన డేంజరస్ సినిమా ద్వారా ఈ భామ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందే పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ భామకు ఫేమ్ రాలేదు. ఆర్జీవీ సినిమా తర్వాతి నుంచి ఈ అమ్మడు ఓవైపు సినిమాలు, మరోవైపు గ్లామర్ పోస్టులతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Apsara Rani Hot images gallery
ఊర్మిళ (Urmila Matondkar)
ఆర్జీవీ సినిమాల్లో అత్యధికసార్లు హీరోయిన్‌గా చేసిన నటి ఊర్మిల. 1992లో నాగార్జున హీరోగా చేసిన ‘అంతం’ సినిమాతో ఊర్మిళ తొలిసారి ఆర్జీవీతో కలిసి వర్క్ చేశారు. ఆ తర్వాత వరుసగా ‘సత్య’, ‘భూత్’, ‘రంగీలా’, ‘అనగనగా ఒక రోజు’, ‘మస్త్’, ‘జంగిల్’, ‘దావుద్’ తదితర చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించి అలరించారు. ముఖ్యంగా రంగీలా సినిమాల్లో ఈమె అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అద్భుతమైన మ్యూజిక్, అందమైన హీరోయిన్ ఉంటే సినిమాను సక్సెస్ చేయవచ్చని ఆర్జీవీ నిరూపించాడు.
అక్కినేని అమల (Akkineni Amala)
స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల.. ఆర్జీవీ తొలి చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. ‘శివ’ హిందీ వెర్షన్‌లోనూ అమల నటించింది. ఇందులో ఆమె చక్కటి నటన కనబరిచి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్జీవీ డైరెక్షన్‌లో సినిమా చేయలేదు.
శ్రీదేవి (Sridevi)
రామ్‌గోపాల్ వర్మకు బాగా ఇష్టమైన హీరోయిన్ ‘శ్రీదేవి’. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన ‘గోవిందా గోవిందా’, ‘క్షణ క్షణం’ చిత్రాల్లో ఆమె కథానాయికగా చేసింది. ఆ తర్వాత కూడా ఆమెతో వర్క్ చేయాలని ఆర్జీవీ భావించిన అది సాధ్యపడలేదు. తన ఫేవరేట్ అయిన శ్రీదేవిపై ఆర్జీవీ పలు వేదికలపై ప్రశంసలు కురిపించడం విశేషం.
రేవతి (Revathi)
ఊర్మిళ తర్వాత ఆర్జీవీ సినిమాల్లో ఎక్కువగా కనిపించిన హీరోయిన్ రేవతి. ‘రాత్రి’, ‘గాయం’, ‘గాయం-2’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ‘నిశబ్ద్’, ‘అబ్ తక్ ఛాపన్’, ‘డర్నా మనా హై’ తదితర హిందీ చిత్రాల్లో ఆమె నటించింది. హార్రర్ (RGV Horror Movies) బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘రాత్రి’ సినిమాలో ఆమె నటన ప్రతీ ఒక్కరిని బయటపెట్టింది. ఈ సినిమా రేవతితో పాటు రామ్ గోపాల్ వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మహేశ్వరి (Maheswari)
ఒకప్పటి స్టార్ నటి మహేశ్వరి సైతం ఆర్జీవీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన గులాబీ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘దెయ్యం’ సినిమాలో మహేశ్వరి లీడ్ రోల్‌లో నటించింది. హర్రర్ సీన్స్‌లో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేశాయి.
మనీషా కోయిరాలా (Manisha Koirala)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా కూడా ఆర్జీవీ తీసిన సూపర్ హిట్ చిత్రాల్లో తళుక్కుముంది. 2002లో వచ్చిన ‘కంపెనీ’ చిత్రం ద్వారా ఆమె తొలిసారి ఆర్జీవీ డైరెక్షన్‌లో నటించింది. ఆ తర్వాత ‘భూత్ రిటర్న్స్’, ‘దర్వాజ బంద్’ సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా భూత్ రిటర్న్స్‌లో ఆమె నటన అందర్ని ఆకట్టుకుంది.
సుస్మితా సేన్ (Sushmita Sen)
ఆర్జీవీ దర్శకత్వంతో పాటు ఆయన నిర్మాతగా వ్యవహరించిన సినిమాల్లో సుస్మితా సేన్ నటించింది. ఆర్జీవీ ప్రొడక్షన్‌లో వచ్చిన ‘మర్రిచెట్టు’ సినిమా.. 2004లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఆమె నటన మెప్పిస్తుంది. అటు ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘AAG’ లోనూ సుస్మితా సేన్ మెరిసింది.
ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)
ఆర్జీవీ డైరెక్షన్‌లో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూడా ఓ సినిమాలో నటించింది. 2008లో వచ్చిన ‘సర్కార్ రాజ్’ అనే హిందీ మూవీలో ఈమె నటించింది. ఇందులో భర్త అభిషేక్ బచ్చన్, మామ అమితాబ్ బచ్చన్‌త
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..