‘రొమాంటిక్’ మూవీ (రివ్యూ )
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘రొమాంటిక్’ మూవీ (రివ్యూ )

    ‘రొమాంటిక్’ మూవీ (రివ్యూ )

    July 20, 2022

    టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్‌ పూరీ జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరీ న‌టించిన రొమాంటిక్ మూవీ నేడు రిలీజైంది. కేతిక శ‌ర్మ. ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే పూరీ అందించ‌గా అనీల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోల‌తో ప్ర‌మోష‌న్స్‌.. ట్రైల‌ర్, సాంగ్స్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. మ‌రి మూవీ ఎలా ఉంది పూరి మార్క్ క‌న‌బ‌డిందా తెలుసుకుందాం.

     స్టోరీ మొత్తం గోవాలో ఉంటుంది. గోవాలో డ్ర‌గ్స్ ముఠాలు..వాళ్ల గొడ‌వ‌ల నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. అందులో ఒక గ్యాంగ్‌లో చేరిన హీరో కొన్ని రోజుల‌కే లీడ‌ర్ అయిపోతాడు. ఇష్టారాజ్యంగా కొన‌సాగుతున్న వీళ్ల అక్ర‌మాల‌ను ఆప‌డానికి ఏసీపీ ర‌మ్య గోవార్క‌ర్ (ర‌మ్య‌కృష్ణ‌) రంగంలోకి దిగుతుంది. దీంతో అత‌డికి, త‌న గ్యాంగ్‌కి, గ‌ర్ల్ ఫ్రెండ్ మౌనిక‌(కేతిక శ‌ర్మ‌)తో రిలేష‌న్‌షిప్‌కి ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఇంత‌కీ ర‌మ్య‌కు వాస్కోడిగామా దొరికాడా త‌ర్వాత ఏం జ‌రిగింది.? మౌనిక‌తో ఉన్న‌ది ప్రేమ కాదు మోహం అని తాను అనుకున్న‌ది నిజ‌మేనా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

    పూరీ మార్క్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. ఆయ‌న అందించిన డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అయితే స్టోరీని త‌క్కువ చూపించే యాక్ష‌న్‌, రొమాన్స్‌ని ఎక్కువ చూపించ‌డంతో క‌థ కాస్త ప‌ట్టుత‌ప్పిన‌ట్లు క‌నిపిస్తుంది. చిన్న వ‌య‌సులోనే పెద్ద బ‌రువైన పాత్ర పోషించాడు ఆకాశ్‌పూరి.  అన్ని పూరీ సినిమాల్లోలాగానే ఇందులోనూ చివ‌ర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. 

    సినిమా చూస్తుంటే పూరీ గ‌త సినిమాలు గుర్తొస్తుంటాయి. అన్నీ సినిమాల‌ను మిక్సీలో వేసి తీసిన‌ట్లు ఉంటుంది. కాక‌పోతే పూరీ సినిమాల్లో ఇంత రొమాన్స్ ఉండ‌టం ఇదే మొద‌టిసారి. ఇది యూత్‌ను ఆక‌ర్షిస్తుంది. ఫ‌స్టాఫ్ మొత్తం యాక్ష‌న్‌, రొమాన్స్, పాట‌ల‌తో నింపేశారు. ర‌మ్య‌కృష్ణ ఎంట్రీ ఇచ్చాక క‌థ కాస్త స్పీడ్ పెరుగుతుంది. కాక‌పోతే హీరోను ప‌ట్టుకునేందుకు ఒక పోలీసాఫీస‌ర్‌గా చేసిన ప్ర‌య‌త్నాలు సిల్లీగా అనిపిస్తాయి. అయితే క్లైమాక్స్‌లో ఎమోష‌న్స్ బాగా పండించారు. ఎండింగ్ విషాదంగా ఉంటుంది. 

     ఆకాశ్ పూరీ త‌న పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. కేతిక శ‌ర్మ పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. రొమాంటిక్ సీన్స్‌లో మాత్రం రెచ్చిపోయింది. ర‌మ్య గోవార్క‌ర్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఆమె పాత్రే సినిమాకి ప్ర‌ధాన ఆకర్ష‌ణ‌.  సినిమా ఏ ద‌శ‌లోనూ లాజిక్‌ల‌కు అంద‌దు. డైలాగ్స్‌లో మాత్రం పూరీ మ‌రోసారి త‌న మార్క్‌ను చూపించారు. అనిల్ పాడూరి పూరీ త‌న‌కిచ్చిన స్టోరీకి న్యాయం చేశాడు. పాట‌ల ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి.

    ఆకాష్, ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌, కేతిక శ‌ర్మ గ్లామ‌ర్ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా చెప్ప‌వ‌చ్చు. క‌థ‌, స్క్రీన్ ప్లే మైన‌స్‌గా మారాయి. అయితే ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంత క‌నెక్ట్ కాకపోయిన‌ప్ప‌టికీ యూత్‌కి ఈ సినిమా న‌చ్చే అవ‌కాశం ఉంది.

    రేటింగ్ -2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version