నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు
దర్శకత్వం: విక్రమ్ రెడ్డి
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
ఎడిటర్: విజయ్ వర్థన్
సినిమాటోగ్రఫీ : సంతోష్ రెడ్డి
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం
నిర్మాణ సంస్థ : లక్కీ మీడియా
విడుదల తేదీ: 28-11-2024
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్, సృజన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యూత్‌ను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం. (Roti Kapda Romance Review)
కథేంటి
ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్ రాహుల్ (సందీప్ సరోజ్), ఆర్జే సూర్య (తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో జీవిస్తుంటారు. వీరిలో విక్కీ మాత్రం ఏ పని చేయకుండా స్నేహితుల డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), హర్షతో సోనియా (కుష్బూ చౌదరి), విక్కీతో శ్వేత (మేఘలేఖ), రాహుల్‌తో ప్రియ (ఠాకూర్) ప్రేమలో పడతారు. అమ్మాయిల రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ప్రేయసితో ఎందుకు విడిపోయారు? బ్రేకప్ తర్వాత నలుగురు కుర్రాళ్లలో వచ్చిన రియలైజేషన్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
ఈ సినిమాలో చేసినవారంతా దాదాపు కొత్తవాళ్లే (Roti Kapda Romance Review). అయినా తమ తమ పాత్రల్లో వారు చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్‌రంగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు కూడా ఎంతగానో అలరించారు. సినిమా మెుత్తం ఈ నాలుగు జంటల చుట్టే తిరిగింది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగిందన్న కాన్సెప్ట్‌తో దర్శకుడు విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఫ్రెండ్‌షిప్, లవ్, బ్రేకప్ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ కొత్తగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నాలుగు విభిన్నమైన ప్రేమకథలను ఒకే ఫ్రేమ్‌పై చూపించడం బాగా కలిసొచ్చింది. పరిణితి నిర్ణయాల వల్ల నేటి యూత్‌కు జరుగుతున్న నష్టాలు, ప్రేమలో ఎదురవుతున్న సమస్యలు, పెళ్లి విషయంలో యూత్ ఆలోచనలను మేళవిస్తూ కథను నడిపిన తీరు మెప్పిస్తుంది. అందరూ కొత్తవారైనప్పటికీ వారి నుంచి ఉత్తమ నటన రాబట్టడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని సీన్లు ఎక్కడో చూసిన ఫీలింగ్ రావడం, పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకపోవడం, కమర్షియల్ హంగులు మిస్ కావడం మైనస్ చెప్పవచ్చు.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Roti Kapda Romance Review) అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సందర్భానుసారంగా వచ్చిన పాటలు సైతం వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- యూత్‌ను ఆకర్షించే ఎలిమెంట్స్
- సంగీతం
మైనస్ పాయింట్స్
- స్టార్ క్యాస్ట్ లేకపోవడం
- కమర్షియల్ హంగులు లేకపోవడం
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!