కరోనా వల్ల ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌లాంటి బడా సినిమాలు వాయిదా పడటంతో… సంక్రాతి రేసులో చిన్న సినిమాలు నిలిచాయి. వాటిలో దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కిన రౌడీ బాయ్స్ చిత్రం ఒకటి. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ నేడు గ్రాండ్‌గా రిలీజైంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం… లీప్‌లాక్ కిస్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రామ్‌చరణ్ రావడం వంటి విషయాల వల్ల ఈ సినిమాకు బజ్ మాత్రం బాగానే వచ్చింది. దిల్ రాజు, శిరీష్ కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు.
కథేంటంటే..
అక్షయ్ (ఆశిష్) ఎల్ఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తుంటాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) బీఎమ్‌సీ మెడికల్ కాలేజీలో మెడిసన్ చదువుతుంటుంది. ఈ రెండు కాలేజీల విద్యార్థులకు అస్సలు పడదు. ఎదురెదురుగా కనిపిస్తే కొట్టేసుకుంటారు. అయితే అక్షయ్, కావ్య ఎలా ప్రేమలో పడ్డారు. కావ్యను ప్రేమిస్తున్న మరో వ్యక్తి ఎవరు. అక్షయ్, కావ్యల ప్రేమ కథ ఎలాంటి ట్విస్ట్‌లతో నడిచిందనేది సినిమా ప్రధాన నేపథ్యం.
నటీనటుల పర్‌ఫార్మెన్స్
పక్కింటబ్బాయిలా ఆశిష్ కనిపిస్తాడు. సినిమా కోసం అతడు చాలా కష్టపడ్డాడు. ఇది తొలి సినిమా అయినా డాన్స్‌లు, ఫైట్స్‌లు బాగా చేశాడు. అయితే యాక్టింగ్‌పై అతడు మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. అనుపమ కావ్య పాత్రకు న్యాయం చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అనుపమ నటన చాలా బాగుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాలో నటించిన విక్రమ్ సహిదేవ్ బాగా చేశాడు. మిగిలిన పాత్రల్లో కార్తీక్ రత్నం, శ్రీకాంత్ అయ్యంగార్, జయప్రకాశ్ ఫర్వాలేదనిపించారు.
డైరెక్టర్ ఆకట్టుకున్నాడా…
హుషారు సినిమాతో మంచి మార్కులో వేయించుకున్న హర్ష కొనుగంటి… తన మలి చిత్రాన్ని కూడా యూత్ కథాంశంగానే తీసుకున్నారు. తొలి అర్ధ భాగాన్ని కాలేజీ, గొడవల నేపథ్యంలో నడిపిన హర్ష… రెండో అర్ధ భాగాన్ని లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌పై నడిపించాడు. అయితే ఎమోషనల్ సీన్లను రక్తి కట్టించడంలో తేలిపోయాడు. హీరో హీరోయిన్‌ను వదిలేసే సీన్స్‌లో ప్రేక్షకులను ఇన్వాల్ చేయలేకపోయాడు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్రాణం. బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా బాగుంది. మదీ సినిమాటోగ్రఫీ మరో లెవెళ్లో ఉంది. సినిమా కోసం నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. అయితే సినిమా మరీ నెమ్మదిగా సాగుతుందనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఇది ఎమోషనల్ డ్రామానే..
రౌడీ బాయ్స్‌గా వచ్చినా ఇదో ఎమోషనల్ డ్రామా. నటీనటులు బాగా చేసినా… డైరెక్టర్ కథను ఆసక్తిగా మలచలేపోయాడు. అలా అని అతడు దారుణంగా విఫలం అవ్వలేదు కూడా. అక్కడక్కడా మెరిసినా… సినిమా లాగ్ వల్ల చూడటానికి వచ్చిన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు. అన్ని రకాల ఆడియన్స్‌ను ఈ సినిమా మెప్పించడం కష్టమే… అయితే యూత్‌కు మాత్రం ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?