‘పుష్ఫ-ది రైజ్’ మూవీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప -ది రూల్’ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా సినిమా కథ గురించి విభిన్నమైన వార్తలు వస్తున్నాయి. రెండో భాగంలో ఇలా జరగబోతుందంటూ రకరకాలుగా ఊహించుకొని కథలు అల్లేస్తున్నారు. కొంతమంది వారి వర్షన్స్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే పుష్ప గురించి ఇప్పటివరకు వచ్చిన కొన్ని రకాల కొన్ని పాయింట్స్ ఏంటంటే..కొండారెడ్డి తమ్ముడు జాలీరెడ్డి శ్రీవల్లిపై కోపంతో రౌడీలతో వెళ్లి ఆమెను చంపేస్తాడని టాక్
- కొండారెడ్డి తమ్ముడు జాలీరెడ్డి శ్రీవల్లిపై కోపంతో రౌడీలతో వెళ్లి ఆమెను చంపేస్తాడని టాక్
- పుష్ప రాజ్‌తో భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) వివాదం హై-వోల్టేజ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది.
- ఈ సినిమాలో అల్లు అర్జున్ 52 ఏళ్లు ఉన్న వ్యక్తిగా నటిస్తాడని మరో రూమర్ చక్కర్లు కొడుతుంది
- సునీల్ (మంగళం శీను) పాత్ర చాలా కీలకంగా మారబోతుందని సమాచారం
- మరోవైపు హీరో నాని ఈ సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి
- మంగళం శ్రీను (సునీల్), దాక్షాయణి (అనసూయ భరద్వాజ్) జాలీ రెడ్డితో కలిసి పుష్పను ఎర్రచందనం సిండికేట్ వ్యాపారం నుంచి తరిమికొట్టడానికి మాస్టర్ ప్లాన్‌ను వేయవచ్చు
- ‘పుష్ప: ది రూల్’లో భన్వర్ సింగ్ షెకావత్ (ఫహద్ ఫాసిల్) గతంతో పాటు స్మగ్లింగ్ వ్యాపారంతో ఉన్న సంబంధాలను కూడా చూపిస్తారని టాక్ నడుస్తుంది.
కథ మొత్తం మొదటి భాగంలోనే తెలిసినప్పటికే దాన్ని రెండో భాగంలో ఎలా చూపించబోతున్నారన్నదే ముఖ్యం. ఇటీవల ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇది ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే దర్శకుడు సుకుమార్ కథను ఊహించన విధంగా మలుపు తిప్పుతాడని చెప్తున్నారు. మనం ఎన్ని రకాలుగా ఊహించుకున్నా చివరికి సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి