Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?

    Rupali Barua: ఆశీష్‌ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?

    May 26, 2023

    జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్‌ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    ఆశిష్‌ – రూపాలి వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి ఆహ్వానించింది.

    రూపాలి ఎవరు?

    అసోంలోని గువాహటిలో ఏప్రిల్ 21, 1973న రూపాలి జన్మించారు. ప్రస్తుతం ఆమె కోలకత్తాలో స్థిరపడ్డారు. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమెకు పేరుంది. సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రూపాలీ గుర్తింపు పొందారు. 

    రూపాలీకి కోల్‌కత్తాలో ఫ్యాషన్‌ డిజైన్‌ స్టోర్స్‌ ఉన్నాయి. నటుడు ఆశీష్‌ తన వ్లాగ్స్‌లో భాగంగా ఓసారి కోల్‌కత్తాలో రూపాలీని కలిశారు. ఆ సందర్భంగా ఫోన్‌ నంబర్లు మార్చుకున్నారు. తొలి పరిచయంలోనే తాము మళ్లీ మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు రూపాలి తెలిపారు. మానవత్వం కలిగిన వ్యక్తి ఆశిష్‌ అని ప్రశంసించారు.

    గతంలో ఆశీష్‌ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ బెంగాలి నటి శకుంతల బారువా కుమార్తె. రాజోషి.. థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా చాలా ఫేమస్‌. వీరికి అర్త్‌ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు.

    అయితే మనస్పర్థల కారణంగా ఆశీష్‌ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. దీంతో అప్పటినుంచి ఆశీష్‌ ఒంటరిగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రూపాలి పరిచయం తర్వాత వారు ఇరువురు డేటింగ్‌లో ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రూపాలి – ఆశీష్‌ పెళ్లి చేసుకున్నారు. 

    ఆశిష్‌ రెండో పెళ్లిపై బాలీవుడ్‌ సినీ విమర్శకుడు కమల్‌ R. ఖాన్‌ ఘాటు విమర్శలు చేశారు. విషెస్‌ చెబుతూనే  ’60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి బాయ్‌సాబ్‌!’ అంటూ ఆశిష్‌ పెళ్లి ఫొటోను షేర్ చేశాడు. 

    ‘కాల్ సంధ్య’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆశీష్‌.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.

    తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్‌ చిత్రాలతో ఆశీష్‌ మరింత పాపులారిటి సంపాదించుకున్నారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

    ఇప్పటివరకు 11 భాషల్లో సినిమాలు చేసిన ఆశీష్‌..  సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. రీసెంట్‌గా రైటర్‌ పద్మాభూషన్‌ సినిమాలోనూ హీరో తండ్రిగా నటించి మెప్పించాడు.  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version