Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

    Sai Pallavi: నిత్యామీనన్‌.. సాయి పల్లవి కంటే గొప్ప నటా? జాతీయ అవార్డ్‌ రాకపోవడంపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

    August 17, 2024

    నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ భామ సినిమాకు ఓకే చెప్పిందంటే అది కచ్చితంగా కంటెంట్‌ ఉన్న మూవీనే అయి ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. గ్లామర్‌ షోకు ఆమడ దూరం ఉండే సాయి పల్లవి తన నటన, మెస్మరైజింగ్‌ డ్యాన్స్‌తోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినా అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాయి. అటువంటి సాయి పల్లవికి తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డు అన్యాయం జరిగినట్లు కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఈ దఫా కచ్చితంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని భావించిన తమను అవార్డ్స్‌ కమిటీ నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 

    సాయిపల్లవిని కాదని..!

    70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను (70th National Film Awards) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 డిసెంబర్‌ 31 నాటికి సెన్సార్‌ అయిన చిత్రాలకుగానూ ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ నటి నామినేషన్స్‌లో గార్గి చిత్రానికి గాను సాయిపల్లవి అవార్డు రేసులో నిలిచింది. తన తండ్రిని జైలు నుంచి తీసుకురావడానికి పోరాడే ఉపాధ్యాయురాలిగా అందులో సాయి పల్లవి అద్భుత నటన కనబరిచింది. దీంతో కచ్చితంగా ఆమెకు నేషనల్ అవార్డు వస్తుందని సినీ విశ్లేషకులతో పాటు ఆమె అభిమానులు భావిస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా నిత్యా మీనన్‌ను జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేసి అవార్డుల ఎంపిక కమిటీ షాకిచ్చింది. తిరుచిట్రంబళం (తమిళం) చిత్రానికి గాను నిత్యామీనన్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. అలాగే ‘కచ్‌ ఎక్స్‌ప్రెస్‌’ అనే గుజరాతీ ఫిల్మ్‌లో నటించిన మానసి పరేఖ్‌కు ఉత్తమ నటి అవార్డ్‌ సంయుక్తంగా వరించింది.

    నిత్యా మీనన్‌ ఏం గొప్ప..!

    నేషనల్ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో సాయి పల్లవికి అన్యాయం జరిగిదంటూ సోషల్‌ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. సాయిపల్లవిని కాదని నిత్యమీనన్‌కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘గార్గి’ సినిమాలో సాయిపల్లవి నటన కంటే నిత్యా మీనన్‌ నటన ఏం బాగుందని ప్రశ్నిస్తున్నారు. తిరుచిట్రంబళం చిత్రంలో నిత్య మీనన్‌ నటన బాగున్నప్పటికీ అది గార్గీలో సాయి పల్లవి యాక్టింగ్‌ను మ్యాచ్‌ చేయలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. తండ్రి కోసం పోరాడే ఉపాధ్యాయురాలి పాత్రలో సాయిపల్లవి జీవించేసిందని గుర్తు చేస్తున్నారు. 

    బెస్ట్‌ యాక్టర్‌గా సౌత్‌ స్టార్‌

    70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ‘ఆట్టమ్‌’  (Aattam) నిలిచింది. ప్రాంతీయ చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కార్తికేయ 2’ ఎంపికైంది. ఉత్తమ కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌ 2’, బెస్ట్‌ హిందీ ఫిల్మ్‌గా గుల్‌మోహర్‌ నిలిచాయి. ఇక ‘కాంతార’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న రిషబ్‌ శెట్టి జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచాడు.

    జాతీయ అవార్డు విజేతలు వీరే

    • ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం) 
    • ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార) 
    • ఉత్తమ నటి: నిత్యా మేనన్‌ (తిరుచిత్రాంబళం – తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్‌ (కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ – గుజరాతి) 
    • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమా: బ్రహ్మాస్త్ర – పార్ట్‌ 1
    • ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి – హిందీ)
    • బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం – తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ 
    • ఉత్తమ సహాయ నటుడు: పవర్‌ రాజ్‌ మల్హోత్రా (ఫౌజా – హరియాన్వి)
    • ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)
    • ఉత్తమ ప్లే బ్యాక్‌ సింగర్‌ : అర్జిత్‌ సింగ్‌ (కేసరియా) – బ్రహ్మాస్త్ర 
    • ఉత్తమ ఫిమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)
    • ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్‌ (బ్రహ్మస్త్ర -హిందీ)
    • ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్‌ రెహమాన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ – 1 తమిళం)
    • ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ – 1 తమిళం) 
    • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: ఆనంద్‌ కృష్ణమూర్తి (పొన్నియిన్‌ సెల్వన్‌ – 1) 
    • ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: శ్రీపాథ్‌ (మాలికాపురం  – మలయాళం)
    • ఉత్తమ స్క్రీన్‌ప్లే:  ఆనంద్‌ ఏకార్షి (ఆట్టం- మలయాళం)
    • ఉత్తమ ఎడిటింగ్‌: మహేష్‌ భువనేండ్‌ (ఆట్టం) 
    • ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: అన్బరివు (కేజీఎఫ్-‌ 2)
    • ఉత్తమ మేకప్‌: సోమనాథ్‌ కుందు (అపరాజితో- బెంగాళీ)
    • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నిక్కి జోషి (కచ్‌ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) 
    • ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్‌ వి చిట్టెల (గుల్‌మోహర్‌)

    ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు

    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2  (తెలుగు)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్‌ 2  (కన్నడ)
    • ఉత్తమ  ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌ – 1  (తమిళం)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం  : గుల్‌మొహర్ (హిందీ)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్‌ (బెంగాళీ)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ  (మరాఠీ)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్‌ (ఒడియా)
    • ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)

    జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ సినిమాలు

    • ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: ఉన్యుత (వాయిడ్‌) – అస్సామీ
    • ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూ
    • ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్‌: మర్మర్స్‌ ఆఫ్‌ ది జంగిల్‌  (మరాఠీ)
    • ఉత్తమ యానిమేషన్‌ సినిమా: ఏ కోకోనట్‌ ట్రీ (సైలెంట్‌)
    • ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్‌ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్‌)
    • ఉత్తమ డెబ్యూ డైరెక్టర్‌ : బస్తి దినేశ్‌ షెనోయ్‌  (ఇంటర్‌మిషన్‌ – కన్నడ)
    • ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌: విశాల్‌ భరద్వాజ్‌ (ఫుర్సత్‌ – లీజర్‌/ హిందీ)
    • ఉత్తమ క్రిటిక్‌: దీపక్‌ దుహా (హిందీ) 
    • ఉత్తమ బుక్‌ ఆన్‌ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్‌ ధార్‌ కిషోర్‌ కుమార్‌ (ది అల్టిమేట్‌ బయోగ్రఫీ – ఇంగ్లిష్‌)
    • ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్‌ దివాన్‌ -మోనో నో అవేర్‌ (హిందీ – ఇంగ్లీష్‌)
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version