SAKSHI VAIDYA: అఖిల్ రోమాంటిక్ వైల్డ్ బాయ్.. అక్కడ  బాగా కోపరేట్ చేశాడు.. ఏజెంట్ హీరోయిన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SAKSHI VAIDYA: అఖిల్ రోమాంటిక్ వైల్డ్ బాయ్.. అక్కడ  బాగా కోపరేట్ చేశాడు.. ఏజెంట్ హీరోయిన్

    SAKSHI VAIDYA: అఖిల్ రోమాంటిక్ వైల్డ్ బాయ్.. అక్కడ  బాగా కోపరేట్ చేశాడు.. ఏజెంట్ హీరోయిన్

    April 24, 2023

    టాలీవుడ్‌లోకి మరో ముంబయి భామ అడుగుపెట్టింది. అందం, అభినయంతో పాటు ఓ చిన్న చిరునవ్వుతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. 

    ఆమె ఎవరో కాదు.. ఏజెంట్‌ చిత్రంలో అఖిల్ సరసన నటించిన సాక్షి వైద్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ అయ్యింది ఈ అమ్మడు.  

    తొలి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్‌ గురించి చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారు. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.

    సాక్షి వైద్యకు తొలి చిత్రం ఏజెంట్. చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఈ సుందరి. సినిమా రిలీజ్‌కు ముందే క్రేజ్‌ను సంపాదించింది. 

    సాక్షి మెుదట టీవీ యాడ్స్‌లో నటించింది. టీవీఎస్‌ XL 100 యాడ్‌లో తళుక్కున మెరిసింది ముంబయి భామ.

    అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్‌ ఇచ్చానంటోంది సాక్షి. ఏజెంట్‌ సినిమాలో హాట్‌ లుక్‌లో కనిపించబోతుంది.

    సినిమా నుంచి విడుదలైన లుక్స్‌ సహా పాటల్లో గ్లామరస్‌గా కనిపించింది ఈ అమ్మడు. మోడ్రన్‌ లుక్‌లో దర్శనమిస్తోంది. 

    ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సాక్షి చేసే రీల్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుంటారు. 

    కుటుంబసభ్యులతో కలిసి ఉండే సాక్షికి బాయ్‌ ఫ్రెండ్ లేడు. కానీ, లవ్‌ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకుందట ఈ మద్దుగుమ్మ. ఎన్నో జంటలను కలిపినట్లు చెబుతోంది. 

    తను ఇంకా ప్రేమలో పడలేదని చెబుతోంది సాక్షి వైద్య. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. 

    ఏజెంట్ సినిమా మినహా మరే సినిమాను ఆమె ఒప్పుకోలేదు. అఖిల్ చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకుంది. 

    తెలుగు చిత్రంతో పరిచయం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసింది సాక్షి. అవకాశాలు వరుస కడతాయని భావిస్తోంది. 

    బాలీవుడ్‌లో ఎక్కువగా ఆడిషన్స్‌ ఇచ్చినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదని చెప్పింది. ఏజెంట్‌ హిట్ అయితే అక్కడ కూడా ఆఫర్లు రావొచ్చు. 

    ఇక ఏజెంట్ షూటింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాక్షి పంచుకుంది. అఖిల్‌ను  రొమాంటిక్ వైల్డ్ బాయ్ అని సెట్స్‌లో తనకు బాగా కోపరేట్ చేశాడని పేర్కొంది.

    ఇక సినిమాలో తనది రాయలసీమ అమ్మాయి పాత్ర అని చెప్పుకొచ్చింది. రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పేటప్పుడు కాస్త ఇబ్బంది పడినట్లు వివరించింది. అయితే తాను మాత్రం ఆ డైలాగ్స్‌ను హిందీలో చెప్పినట్లు పేర్కొంది. వాటిని తెలుగులో డబ్ చేశారని తెలిపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version