Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?

    Salaar Movie Review: యాక్షన్‌ సీన్లలో ప్రభాస్ ఊచకోత.. ‘సలార్‌’ ఎలా ఉందంటే?

    December 22, 2023

    నటీనటులు: ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, జగపతిబాబు, బాబీ సింహా, టినూ ఆనంద్‌, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి తదితరులు

    రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

    సంగీతం: రవి బస్రూర్‌

    సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కుల్‌కర్ణి

    నిర్మాత: విజయ్‌ కిరంగదూర్‌

    విడుదల: 22-12-2023

    పాన్ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్‌ (Prabhas) హీరోగా ‘కేజీఎఫ్‌’ (KGF) ఫేమ్‌ ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స‌లార్‌’. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా నటించారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా చేసింది. ఎప్ప‌ట్నుంచో  ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ విశేషంగా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. అభిమానుల కోలహాలం మధ్య ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉంది? ప్రభాస్‌ కటౌట్‌కు తగిన హిట్‌ పడిందా? డైరెక్టర్ ప్రశాంత్‌నీల్‌కు ఖాతాలో మరో బ్లాక్‌ హిస్టర్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. 

    కథ

    ఖాన్సార్ అనే సామ్రాజ్యానికి రాజ మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) రూలర్‌. ఆ సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. అయితే రాజ మన్నార్ కుర్చీ కోసం కుతంత్రాలు మొద‌ల‌వుతాయి. దొరలు అంతా కలిసి సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకొని రాజమన్నార్‌ను అంతం చేస్తారు. అయితే తన కొడుకు వ‌ర‌ద రాజమ‌న్నార్ (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌)ని ఖాన్సార్‌కు రూలర్‌గా చూడాలనేది రాజమన్నార్‌ కోరిక‌. దీంతో వ‌ర‌ద త‌న సైన్యంగా చిన్న‌నాటి స్నేహితుడు దేవా (ప్ర‌భాస్‌)ని పిలుస్తాడు. ఆ ఒక్క‌డు అంత‌మంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? త‌న ప్రాణ స్నేహితుడు వ‌ర‌ద కోసం దేవా ఏం చేశాడు? అత‌నికి స‌లార్ అనే పేరెలా వ‌చ్చింది? వీళ్ల జీవితంలోకి ఆద్య (శ్రుతిహాస‌న్) ఎలా వ‌చ్చింది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

    ఎవరెలా చేశారంటే

    బాహుబలి తర్వాత ప్రభాస్‌ ఆ స్థాయిలో మెప్పించిన చిత్రం సలార్‌. తన కటౌట్‌కు తగ్గట్లు యాక్షన్‌ సీన్లలో అదరగొట్టాడు. త‌ల్లి చాటు కొడుకుగా, మాట జ‌వ‌దాట‌ని స్నేహితుడిగా ఆయన నటన ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో ప్ర‌భాస్ క‌నిపించిన తీరు, హీరోయిజం, స్టైల్ మెప్పిస్తుంది. శ్రుతిహాస‌న్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేనప్పటికీ ప్ర‌థ‌మార్ధంలో ఆమే కీల‌కం. పృథ్వీరాజ్ సుకుమార‌న్ అద్భుత నటన కనబరిచాడు. స్నేహితులుగా ప్ర‌భాస్‌కీ, ఆయ‌న‌కీ మ‌ధ్య మంచి కెమిస్ట్రీ క‌నిపించింది. ఈశ్వ‌రీరావు, బాబీ సింహా, జ‌గ‌ప‌తిబాబు, మైమ్ గోపి,  శ్రియారెడ్డి, ఝాన్సీ, జాన్ విజ‌య్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’తో మరోమారు తన మార్క్‌ చూపించారు. ఖాన్సార్ పేరుతో ఓ క‌ల్పిత  ప్ర‌పంచాన్ని సృష్టించి దాని చుట్టూ అద్భుతమైన క‌థ‌ని అల్లారు. కె.జి.యఫ్ సినిమాల‌తో పోలిస్తే హీరోయిజం, ఎలివేష‌న్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు. చాలా చోట్ల కె.జి.యఫ్ సినిమా గుర్తొస్తోంది. అయితే ప్ర‌భాస్‌కి త‌గ్గట్టు మాస్, యాక్ష‌న్ అంశాల్ని మేళ‌వించ‌డంలో ప్ర‌శాంత్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. అవసరమైన చోట్ల ప్రభాస్‌కు ఎలివేష‌న్ల‌ు ఇచ్చి అభిమానుల‌కి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు ప్రశాంత్. అయితే కుర్చీ చుట్టూ అల్లిన కుతంత్ర‌పు డ్రామా, కుటుంబ పాత్ర‌ల మ‌ధ్య వ‌ర‌సలు కొంచెం గజిబిజి అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో స‌ర‌ళంగా క‌థ‌ని చెప్ప‌లేక‌పోయారు డైరెక్టర్. ఓవరాల్‌గా స‌గ‌టు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించేలా డ్రామాను నడిపించడంలో ప్రశాంత్‌నీల్‌ సక్సెస్ అయ్యారు. 

    సాంకేతికంగా

    సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ఖాన్సార్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. రవి బ‌స్రూర్ బాణీలు, నేప‌థ్య‌ సంగీతం, భువ‌న్ గౌడ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. అన్బ‌రివ్ స్టంట్స్ ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్న‌తంగా ఉన్నాయి. నిర్మాత ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • ప్రభాస్, పృథ్వీ నటన
    • యాక్షన్‌ సన్నివేశాలు
    • భావోద్వేగాలు, క్లైమాక్స్

    మైనస్‌ పాయింట్స్‌

    • సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌

    రేటింగ్‌: 3.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version