టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha Ruth Prabhu) ఇంట్లో ఘోర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు తుది శ్వాస విడిచారు. ఈ విషాదకరమైన వార్తను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకున్నారు. “మనం మళ్లీ కలిసే వరకు, నాన్న” అంటూ హృదయాన్ని తాకే మాటలతో హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జత చేశారు. చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించిన సమంత, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఎన్నోసార్లు గర్వంగా వ్యక్తం చేసింది.
సమంత జీవితంలో తండ్రి ప్రాధాన్యత
సమంత జీవితంలో జోసెఫ్ ప్రభు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. చిన్నతనం నుండి ఆమెకు ఉన్నత విలువలను నేర్పి, తన ప్రతి నిర్ణయానికి అండగా నిలిచారు. సినీ రంగంలో ప్రవేశించిన సమయంలో తన తండ్రి నుంచి అద్భుతమైన మద్దతు లభించిందని సమంత గతంలో అనేక ఇంటర్వ్యూలలో వెల్లడించారు. “తన తొలి సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసినప్పుడల్లా ఆయన ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపింది” అని సామ్ వెల్లడించింది.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణం
జోసెఫ్ ప్రభు గురువారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. (Samantha Ruth Prabhu)ఈ వార్త తెలుసుకున్న వెంటనే సమంత ముంబై నుంచి తన స్వస్థలమైన కేరళకు చేరుకున్నారు. శనివారం జోసెఫ్ ప్రభు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
సమంత కుటుంబం
సమంత 1987 ఏప్రిల్ 28న కేరళలోని అలప్పుజలో జన్మించింది. జోసెఫ్ ప్రభు (Joseph Prabhu) ఆంగ్లో-ఇండియన్ కాగా, ఆమె తల్లి నినెట్ ప్రభు మలయాళీ. ఆమెకు ఇద్దరు అన్నలు జోనాథన్, డేవిడ్ ఉన్నారు.
తండ్రి-కూతుళ్ల అనుబంధం
సమంత తన తండ్రితో ఉన్న బంధాన్ని ఎంతో ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటుంది. ఒక ఇంటర్వ్యూలో, “నా తండ్రి నాకు జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొనే ధైర్యం నేర్పించారు. ఆయన ప్రోత్సాహం లేకుండా నేను ఈ స్థాయికి చేరుకోలేను” అని చెప్పుకొచ్చింది. తండ్రి మరణ వార్త సమంతను తీవ్రంగా కలచివేసింది. “నాన్న నాకు నడిచే దైవం. ఆయన నాకు నేర్పించిన విలువలే నన్ను ముందుకు నడిపించాయి. ఇప్పుడు ఆయన లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను” అని ఆవేదనతో తన సన్నిహితులతో పంచుకుంది.
విడాకుల సమయంలో తండ్రి మద్దతు
2021లో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పుడు, జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) తన ఫేస్‌బుక్‌లో వారి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను అంగీకరించడానికి ఆయనకు ఎంతో సమయం పట్టిందని, కానీ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆశతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సెలబ్రెటీల సానుభూతి
జోసెఫ్ ప్రభు మరణవార్త తెలుసుకున్న వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సమంతకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
సమంతకు కష్టకాలం
సమంతకు 2021 నుంచి బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పవచ్చు. నాగచైతన్యతో విడాకుల అనంతరం.. ఆమె మయోసైటిస్ వ్యాధి బారిన పడటం జరిగింది. దాని నుంచి కోలుకోవడానికి సామ్‌కు రెండేళ్లు పట్టింది. దాదాపు రెండేళ్లు సమంత సినిమాలకు దూరమై, ఒంటరిగా చాలా బాధలు పడింది. అనంతరం ఆమె చేసిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడంతో చాలా కృంగిపోయింది. తాజాగా నాగచైతన్య – శోభిత దూళిపాల ఎంగేజ్‌మెంట్ కూడా ఆమెను ఓ రకంగా బాధ పెట్టిందని చెప్పవచ్చు.
సమంత ప్రస్తుత బిజీ షెడ్యూల్
ఇటీవలే సిటాడెల్ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమంత, తండ్రి మరణ వార్త విన్న వెంటనే తన సొంత ఊరికి చేరుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మరణ వార్త విన్న ఆమె అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, సామ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ