టాలీవుడ్ అగ్రకథానాయికల్లో సమంత ఒకరు. నాగచైతన్య హీరోగా 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే చిత్రంతో సామ్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో అండుగుపెట్టింది. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు చేసి టాలీవుడ్ నెం.1 హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం ఈ అమ్మడి జీవితాన్ని కుదిపిసేంది. అనారోగ్యం కారణంగా కొద్దికాలం పాటు సినిమాలకు సైతం బ్రేక్ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె మాజీ భర్త నాగచైతన్య నటి శోభితా ధూళిపాళ్లతో రెండో పెళ్లికి రెడీ కావడంతో ఇక సామ్ (Samantha Second Marriage) కూడా మంచి తోడును వెతుక్కోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో నటి సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన రెండో పెళ్లి గురించి చెప్పకనే చెప్పింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
తల్లి కావాలని ఉంది: సమంత
సమంత నటింటిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సిటడెల్: హనీ బన్నీ’ అమెజాన్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇందులో సమంత తల్లి పాత్ర పోషిస్తూనే స్పై ఏజెంట్‌గా అదరొట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లో దుమ్మురేపింది. ఈ క్రమంలో ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాతృత్వం (Samantha Second Marriage) గురించి ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలో సామ్ మాట్లాడుతూ తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటున్నట్లు చెప్పింది. తల్లిగా ఉండటాన్ని తాను ఇష్టపడతానని, ఆ అనుభూతి పొందాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటానని స్పష్టం చేసింది. ఆ సమయం కోసం వేచి చూస్తున్నట్లు సామ్ పేర్కొన్నారు. మాతృత్వం గురించి చెప్పగానే తన వయసు గురించి అందరూ మాట్లాడతారని, అదేమి పెద్ద అడ్డంకి కాదని సామ్ చెప్పుకొచ్చింది.
రెండో పెళ్లిపై హింట్ ఇచ్చినట్లేనా!
సామ్ మాజీ భర్త నాగచైతన్య నటి శోభితా దూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామ్ ఎందుకు సింగిల్‌గా ఉండాలని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తనకు తగిన వ్యక్తిని పెళ్లి (Samantha Second Marriage) చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఈ మేరకు గత కొంతకాలంగా అభిమానుల నుంచి పెద్ద ఎత్తున రిక్వెస్టులు వస్తున్నా సామ్ ఇంతవరకూ దానిపై స్పందించలేదు. అయితే లేటెస్ట్‌గా తాను తల్లి కావాలని కోరుకుంటున్నట్లు, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు సామ్ వ్యాఖ్యానించడం ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. రెండో పెళ్లికి తాను సానుకూలమన్న సంకేతాన్ని సామ్ చెప్పకనే చెప్పిందని అభిప్రాయపడుతున్నారు. సినీ కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగతంగానూ ఆమె మంచి లైఫ్‌ను లీడ్ చేయాలని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
సరోగసిపై సామ్ దృష్టి?
వైద్య రంగంలో ఎన్నో విఫ్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. సరోగసి, టెస్ట్‌ట్యూబ్ బేబీ వంటి ఆధునిక సంతాన సాఫల్య విధానాలు అందుబాటులోకి వచ్చాయి. తమిళ స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సరోగసి విధానంలో ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చింది. తెలుగు నటి మంచు లక్ష్మీ (Manchu Lakshmi) కూడా అదే తరహా ఆడబిడ్డకు తల్లి అయ్యింది. ఇప్పుడు సామ్ (Samantha Second Marriage) కూడా సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం లేకపోలేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రెండో పెళ్లిపై ఇప్పటివరకూ ఆమె ఎక్కడా స్పష్టమైన ప్రకటన చేయలేదని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆమెకు సెకండ్ మ్యారేజ్ ఆలోచన లేకపోయి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. తల్లి కావాలన్న కోరిక బలంగా ఉన్న నేపథ్యంలో సామ్ కూడా సరోగసి విధానంలో తల్లయ్యే విధానాన్ని పరిశీలించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
చై – శోభిత వివాహ షెడ్యూల్!
టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: రౌడీ బాయ్‌ను మళ్లీ గెలికిన అనసూయ! దూరపు కొండలు అంటూ..