Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

    Top 10 Popular Actresses: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టిన సమంత.. సామ్‌తో అంత ఈజీ కాదు..!

    దేశంలో సినిమా సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ ఇంకెవరికీ ఉండదు. కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆ తారలను సమాజం ఎప్పుడూ ప్రత్యేకంగా చూస్తుంటుంది. వారికి సంబంధించిన అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్ల గురించి నెట్టింట తెగ సెర్చ్‌ చేస్తుంటారు ఫ్యాన్స్‌. అభిమాన తారల విషయాలను తెలుసుకొని సంతోషిస్తుంటారు. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న హీరోయిన్ల జాబితాను ఓర్‌మ్యాక్స్‌(Ormax) మీడియా సంస్థ తాజాగా విడుదల చేసింది. సినీ ఇండస్ట్రీలో పాపులారిటీ, క్రేజ్, ఫాలోయింగ్, సినిమాలు ఇలా అన్ని అంశాలను పరిశీలించి ఈ జాబితాను రూపొందించింది. మరి ఆ జాబితాలోని టాప్‌-10 హీరోయిన్స్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం.

    1. సమంత

    జూన్‌ నెలలో దేశంలోనే అత్యధిక పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్‌గా టాలీవుడ్‌ అగ్రకథానాయిక సమంత నిలిచింది. బాలీవుడ్‌ భామలు అలియా భట్‌, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్‌, కియారా అద్వానీ వంటి తారలను వెనక్కి నెట్టి మరి సామ్‌ టాప్‌లో నిలవడం విశేషం. అంతేకాదు మోస్ట్ లవింగ్ హీరోయిన్‌, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్ జాబితాలో కూడా సమంత ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 

    2. అలియా భట్‌

    బాలీవుడ్‌ అగ్రకథనాయికల్లో ఒకరైన అలియా భట్‌.. తాజా జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. జూన్‌ నెలలో సమంత పాపులారిటీతో పోలిస్తే అలియా క్రేజ్‌ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. RRR చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా చేసిన అలియా.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

    3. దీపికా పదుకొనే

    బాలీవుడ్‌ టాప్‌-5 హీరోయిన్స్‌ జాబితాలో దీపికా పదుకొనే పేరు కచ్చితంగా ఉంటుంది. అటువంటి దీపికా ఓర్‌మ్యాక్స్‌ మీడియా నివేదికలో మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల షారుక్‌కు జోడిగా ఈ భామ నటించిన పఠాన్‌ చిత్రం బాలీవుడ్‌లో అన్ని రికార్డులను చెరిపేసింది. 

    4. నయనతార

    కోలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ నయనతార దేశంలో అత్యధికంగా క్రేజ్‌ సంపాదించిన కథానాయికల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. వరుసగా హీరోయిన్‌ ఒరియంటెడ్‌ సినిమాలు చేస్తూ ఈ భామ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటోంది. 

    5. కాజల్‌ అగర్వాల్‌

    ఇటీవల కాలంలో స్టార్‌ హీరో సినిమాల్లో నటించనప్పటికీ హీరోయిన్‌ కాజల్‌ ‌అగర్వాల్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమెను అగ్రకథానాయికగానే అభిమానులు ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాజల్‌ తాజా జాబితాలో ఐదో స్థానం దక్కించుకుంది.

    6. త్రిష

    పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం ద్వారా హీరోయిన్‌ త్రిష తిరిగి మునుపటి పాపులారిటీని సొంతం చేసుకుంది. తద్వారా ఓర్‌మ్యాక్స్‌ నివేదికలో ఆరో స్థానంలో చోటు సంపాదించింది. ప్రస్తుతం తమిళ్‌ హీరో విజయ్‌ చేస్తున్న లియో సినిమాలో త్రిష నటిస్తోంది.

    7. కత్రినా కైఫ్‌

    బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ అందరూ ఊహించినట్లే తాజా జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే గతంతో పోలిస్తే జూన్‌లో ఆమె పాపులారిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ఈ భామ టైగర్‌-3, మెరీ క్రిస్మస్‌ చిత్రాల్లో నటిస్తోంది. 

    8. కియాారా అద్వానీ

    బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ కియారా అద్వానీ వరుస హిట్స్‌ సాధిస్తూ అగ్రకథానాయికలకు గట్టి పోటీ ఇస్తోంది. టాలీవుడ్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో గేమ్‌ఛేంజర్‌ మూవీలోనూ ఈ భామ నటిస్తోంది. ప్రస్తుత జాబితాలో కియారా ఎనిమిదో స్థానంలో ఉంది. 

    9. కీర్తి సురేష్‌

    తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు కీర్తి సురేష్‌. ఇటీవల ఈ భామ నటించిన దసరా చిత్రం బ్లాక్‌ బాస్టర్‌గా నిలిచింది. తాజాగా విడుదలైన నాయకుడు కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. 

    10. రష్మిక మందన్న

    నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న ఓర్‌మ్యాక్స్‌ నివేదికలో చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రష్మిక యానిమల్‌, పుష్ప-2, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version