Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా గెలాక్సీ మెుబైల్.. కాకరేపుతున్న ఫీచర్లు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా గెలాక్సీ మెుబైల్.. కాకరేపుతున్న ఫీచర్లు!

    Samsung Galaxy A05: రూ.10 వేలకే నయా గెలాక్సీ మెుబైల్.. కాకరేపుతున్న ఫీచర్లు!

    November 8, 2023

    అత్యంత నాణ్యవంతమైన మెుబైల్స్‌ను రిలీజ్‌ చేసే కంపెనీల్లో శాంసంగ్‌ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా శాంసంగ్‌ గెలాక్సీ (Samsung Galaxy) మెుబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు చాలా మంది టెక్‌ ప్రియులు ఆసక్తికనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శాంసంగ్‌ ఎప్పటికప్పుడు కొత్త గెలాక్సీ ఫోన్‌లను లాంచ్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ మరో గెలాక్సీ మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Samsung Galaxy A05’ పేరుతో కొత్త ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    ఈ గెలాక్సీ మెుబైల్‌  6.7 అంగుళాల HD+ PLS LCD స్క్రీన్‌తో రానుంది. 1,600 x 720 pixels రిజల్యూషన్‌, 60Hz రిఫ్రెష్‌ రేట్‌ను ఫోన్‌కు అందించారు. MediaTek Helio G85 SoC ప్రొసెసర్‌, Mali G52 GPU, Android 13 ఆధారిత  OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌ పని చేయనుంది. 

    స్టోరేజ్‌ సామర్థ్యం

    Galaxy A05 మెుబైల్‌ పవర్‌ఫుల్‌ ర్యామ్‌తో రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 4GB LPDDR4X RAM / 128GB of eMMC 5.1 స్టోరేజ్‌ను ఫోన్‌కు అందించినట్లు తెలుస్తోంది. microSD కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశాన్ని శాంసంగ్‌ ఈ మెుబైల్‌కు కల్పించింది.

    కెమెరా క్వాలిటీ

    ఈ గెలాక్సీ ఫోన్‌ నాణ్యమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. 50 MP ప్రైమరీ + 2MP డెప్త్‌ షూటర్‌ సెన్సార్‌తో కూడిన డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను ఫోన్‌కు అందించారు. ఇక ముందు వైపు 8 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. 

    బిగ్‌ బ్యాటరీ

    ఈ Galaxy A05 మెుబైల్‌ 5,000mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. దీనికి 25W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. ఫలితంగా మెుబైల్‌ను చాలా ఫాస్ట్‌గా చార్జ్‌ చేసుకోవచ్చని శాంసంగ్ వర్గాలు చెబుతున్నాయి. USB Type-C portతో ఇది వస్తుంది. 

    అదనపు ఫీచర్లు

    ఈ మెుబైల్‌ 4G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఇందులో ఉంది. అలాగే WiFi 802.11, Bluetooth 5.3, USB 2.0, GPS, 3.5mm ఆడియో జాక్‌, 168.8mm x 78.2mm x 8.8mm కొలతలతో ఫోన్ రానుంది. 

    కలర్ ఆప్షన్స్‌

    Galaxy A05 స్మార్ట్‌ఫోన్ మెుత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో రానుంది. నలుపు (Black), సిల్వర్ (Silver), లైట్ గ్రీన్ (Light Green) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    Samsung Galaxy A05 మెుబైల్‌ ధర, భారత్‌లో లాంచింగ్‌ తేదీని శాంసంగ్ ఇంకా ప్రకటించలేదు. నవంబర్‌లోనే ఫోన్‌ రిలీజయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మెుబైల్‌ ధర రూ. 9,890 వరకూ ఉండొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version