టెక్ దిగ్గజం శాంసంగ్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. ఆ సంస్థ రిలీజ్ చేసే స్మార్ట్‌ఫోన్స్ కోసం మెుబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే శాంసంగ్ మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. Samsung Galaxy A05 పేరుతో అధునాతన మెుబైల్‌ను మలేషియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను భారత్‌లోనూ రిలీజ్ చేసేందుకు ఈ కొరియన్ కంపెనీ ఇప్పటికే సన్నాహాలు మెుదలుపెట్టింది. అక్టోబర్ 16-22 తేదీల మధ్య ఈ ఫోన్ భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వేరియంట్స్
శాంసంగ్ తన లేటెస్ట్ మెుబైల్‌ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేసింది. Samsung Galaxy A05, Samsung Galaxy A05s పేరుతో వాటిని పరిచయం చేసింది. ఇందులో A05s కాస్త అడ్వాన్స్‌డ్ అని చెప్పవచ్చు.
ఫోన్ స్క్రీన్
Galaxy A05s మెుబైల్ 6.7 అంగుళాల FHD స్క్రీన్, 90 Hz రిఫ్రెష్ రేట్, Qualcomm Snapdragon 680 ప్రొసెసర్‌ను కలిగి ఉంది. Galaxy A05 వేరియంట్‌కు 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, MediaTek’s Helio G85 చిప్‌సెట్‌ను అమర్చారు.
స్టోరేజ్ సామర్థ్యం
Galaxy A05s, Galaxy A05 మెుబైల్స్ రెండూ కూడా 6GB RAM/128GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ స్టోరేజ్‌ను microSD card ద్వారా 1TB వరకూ పెంచుకునే అవకాశాన్ని శాంసంగ్ కల్పించింది.
పవర్‌ఫుల్ బ్యాటరీ
ఈ రెండు ఫోన్లకు శక్తివంతమైన బ్యాటరీని శాంసంగ్ అందించింది. Galaxy A05s, Galaxy A05 మెుబైల్స్ రెండూ 5,000mAh బ్యాటరీనికి కలిగి ఉన్నాయి. దీనికి 25W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీని వల్ల ఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
కెమెరా
Galaxy A05s మెుబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు 50MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ అందించారు. అలాగే ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. ఇక Galaxy A05 స్మార్ట్‌ఫోన్‌కు వెనకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఇది 50MP ప్రైమరి కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాతో ఇది రాబోతోంది.
కలర్స్
ఈ రెండు ఫోన్లు మూడు రంగుల్లో మార్కెట్‌లోకి రానున్నాయి. నలుపు (Black), సిల్వర్ (Silver) లైట్ గ్రీన్ (Light Green) కలర్స్‌లో వీటిని పొందవచ్చు.
ధర ఎంతంటే?
ప్రస్తుతం Galaxy A05s, Galaxy A05 స్మార్ట్‌ఫోన్స్ మలేషియాలో మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ మెుబైల్స్ అక్టోబర్ 16న భారత మార్కెట్‌లో అడుగుపెడతాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. Galaxy A05 వేరియంట్ ధర రూ. 9,890గా ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. అలాగే Galaxy A05s మెుబైల్‌ను రూ. 12,999కు అందుబాటులోకి తీసుకురావచ్చని అభిప్రాయపడుతున్నాయి. ఈ మెుబైల్స్ ధరపై లాంచింగ్ రోజు స్పష్టత రానుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!