Samsung Galaxy A15: బడ్జెట్‌లో మరో గెలాక్సీ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy A15: బడ్జెట్‌లో మరో గెలాక్సీ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    Samsung Galaxy A15: బడ్జెట్‌లో మరో గెలాక్సీ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    February 29, 2024

    ప్రముఖ కొరియన్‌ కంపెనీ శాంసంగ్‌ రిలీజ్ చేసే గెలాక్సీ (Samsung Galaxy) మెుబైల్స్‌కు దేశీయ మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలోనే శాంసంగ్‌ ఎప్పటికప్పుడు కొత్త గెలాక్సీ ఫోన్‌లను లాంచ్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే శాంసంగ్‌ మరో గెలాక్సీ మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Samsung Galaxy A15’ పేరుతో కొత్త ఫోన్‌ను పరిచయం చేయబోతోంది. ‘Galaxy A14’ మెుబైల్‌కు కొనసాగింపుగా దీన్ని తీసుకొస్తున్నారు. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    రెండు వేరియంట్లలో..

    Samsung Galaxy A15 మెుబైల్‌ రెండు వేరియంట్లలో విడుదల కానున్నట్లు సమాచారం. 4G, 5G ఆప్షన్స్‌లో ఫోన్‌ అందుబాటులోకి రానున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. 

    ఫోన్‌ స్క్రీన్‌

    Galaxy A15 మెుబైల్‌.. 6.4 అంగుళాల LCD స్క్రీన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి 1080 x 2408 పిక్సెల్స్‌ క్వాలిటీతో పాటు 90Hz రిఫ్రెష్‌ రేట్‌ కూడా అందిస్తారని తెలిసింది. ఇక ఈ ఫోన్‌ Android 14 OS, Mediatek Helio G99 (6nm) చిప్‌సెట్‌, Octa-core సీపీయూ, Mali-G57 MC2 జీపీయూతో వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ ఫోన్‌ ర్యామ్‌ & స్టోరేజ్‌ఆధారంగా మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 4GB RAM + 64GB ROM, 4GB RAM + 128GB ROM, 6GB RAM + 128GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఫోన్‌ లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటు కూడా ఉండనుంది.

    కెమెరా క్వాలిటీ

    Samsung Galaxy A15 స్మార్ట్‌ఫోన్.. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 50MP + 5MP + 2MP కెమెరాలు ఫోన్‌ వెనుక భాగంలో అమర్చనున్నట్లు తెలిసింది. ఇక ముందు వైపు 13MP సెల్ఫీ కెమెరాను కూడా ఫిక్స్‌ చేస్తారని సమాచారం. 

    కనెక్టివిటి ఫీచర్లు 

    ఈ గెలాక్సీ మెుబైల్‌.. Wi-Fi 802.11, GPS, GALILEO, GLONASS, BDS, QZSS, USB Type-C పోర్ట్ వంటి కనెక్టివిటి ఫీచర్లను కలిగి ఉండనుంది. వీటితో పాటు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌, ప్రాక్సిమిటి, డిజిటల్‌ దిక్సూచి వంటి సెన్సార్లు కూడా ఫోన్‌లో ఉంటాయని సమాచారం.  

    ధర ఎంతంటే?

    Galaxy A15 మెుబైల్‌ ధర, విడుదల తేదీపై శాంసంగ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ ధర రూ.11,999గా ఉండవచ్చని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version