Samsung Galaxy A25: శాంసంగ్‌ నుంచి మరో క్రేజీ గెలాక్సీ ఫోన్‌.. అదరగొడుతున్న స్టన్నింగ్ ఫీచర్స్‌!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy A25: శాంసంగ్‌ నుంచి మరో క్రేజీ గెలాక్సీ ఫోన్‌.. అదరగొడుతున్న స్టన్నింగ్ ఫీచర్స్‌!

    Samsung Galaxy A25: శాంసంగ్‌ నుంచి మరో క్రేజీ గెలాక్సీ ఫోన్‌.. అదరగొడుతున్న స్టన్నింగ్ ఫీచర్స్‌!

    February 29, 2024

    ప్రముఖ టెక్‌ కంపెనీ శాంసంగ్‌ (Samsung)కు మంచి మెుబైల్స్‌ను తయారు చేస్తుందన్న పేరుంది. అందుకే ఈ సంస్థ లాంచ్‌ చేసే ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. టెక్‌ ప్రియులు శాంసంగ్‌ మెుబైల్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో కొత్తగా మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసేందుకు శాంసంగ్‌ సిద్ధమవుతోంది.‘Samsung Galaxy A25’ పేరుతో కొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేయడానికి సమయత్తమవుతోంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్‌ వివరాలు ఆన్‌లైన్‌ ప్రత్యక్షమయ్యాయి. నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. కాబట్టి ‘Galaxy A25’ మెుబైల్‌ ధర, ప్రత్యేకతలు, ఫీచర్లు వంటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ గెలాక్సీ మెుబైల్‌ 6.44 అంగుళాల Super AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 90Hz రిఫ్రెష్‌ రేట్‌, 1080 x 2340 పిక్సెల్ క్వాలిటీతో దీన్ని తీసుకొచ్చారు. Android 14 ఆధారిత One UI 6 OS, Exynos 1280 చిప్‌సెట్‌తో ఫోన్ రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

    బిగ్‌ బ్యాటరీ

    ఈ Galaxy A25 పవర్‌ఫుల్‌ బ్యాటరీతో రాబోతున్నట్లు తెలిసింది. ఈ మెుబైల్‌కు 5000 mAh Li-Po బ్యాటరీని ఫిక్స్‌ చేస్తున్నారట. దీనికి 25W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తారని సమాచారం. 

    స్టోరేజ్ సామర్థ్యం

    Samsung Galaxy A25 మెుబైల్‌ను రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో తీసుకొస్తున్నట్లు తెలిసింది. 6 జీబీ ర్యామ్ / 128జీబీ స్టోరేజ్​, 8జీబీ ర్యామ్​ / 256జీబీ స్టోరేజ్​ అనే రెండు ఆప్షన్స్‌లో ఈ ఫోన్‌ రాబోతున్నట్లు ఆన్‌లైన్‌లో సమాచారం లీకైంది.

    కెమెరా క్వాలిటీ

    ఈ నయా శాంసంగ్‌ మెుబైల్‌ ట్రిపుల్‌ రియర్ కెమెరా సెటప్‌తో రానుందట. 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్​, 2MP మాక్రో లెన్స్ సెటప్‌ ఫోన్‌ వెనక భాగంలో ఉండనున్నాయి. ఇక ముందు వైపు  13MP ఫ్రంట్‌ కెమెరాను ఫిక్స్‌ చేస్తారని తెలిసింది. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌ 5G సపోర్ట్‌తో రానుంది. అలాగే ఇందులో Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, USB Type-C 2.0, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌, గైరో వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 

    కలర్ ఆప్షన్స్‌

    ఈ Galaxy A25 మెుబైల్‌ మెుత్తం నాలుగు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్ కానున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. నలుపు (Black), బలుగు (Blue), పసుపు (Silver), సిల్వర్‌ (Yellow) రంగుల్లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు. 

    ధర ఎంతంటే?

    Galaxy A25 మెుబైల్‌ లాంచ్‌ తేదీ, ధరను శాంసంగ్‌ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ఈ ఫోన్‌ వచ్చే ఏడాది (2024) ప్రారంభంలో రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. 6GB + 128GB ధర రూ.26,800, 8GB + 256GB వేరియంట్‌ ధర రూ.35,700 వరకూ ఉండొచ్చని టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై త్వరలోనే శాంసంగ్‌ స్పష్టత ఇవ్వనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version