దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ (Samsung)కు ప్రపంచ వ్యాప్తంగా మంచి మార్కెట్ ఉంది. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు విపరీతమైన ఆదరణను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ఫోన్స్‌కు టెక్ ప్రియుల్లో మంచి గుడ్‌విల్ ఉంది. ఇదిలా ఉంటే శాంసంగ్ మరో సరికొత్త ఫోన్‌తో ప్రపంచ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొరియన్ సంస్థ కొత్తగా ‘Samsung Galaxy A35’ లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ‘Samsung Galaxy A34 5G’ మెుబైల్‌కు కొనసాగింపుగా ఇది రానున్నట్లు శాంసంగ్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే విడుదలకు ముందే ఈ నయా గెలాక్సీ ఫోన్‌లోని ముఖ్యమైన ఫీచర్స్ లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఫోన్ స్క్రీన్
Samsung Galaxy A35 మెుబైల్.. 6.6 అంగుళాల Super AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ కూడా అందిస్తారని సమాచారం. Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్‌ను డిస్‌ప్లే కలిగి ఉంటుందట. Android 14 ఆధారిత One UI 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ రన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ ఫోన్ Galaxy A35 లాగే మూడు వేరియంట్లలో రానున్నట్లు తెలిసింది. 6GB RAM + 128GB ROM, 8GB RAM + 128GB ROM, 12GB + 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌లో లాంచ్ అవుతుందని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకూ పెంచుకోవచ్చని అంటున్నారు.
కెమెరా క్వాలిటీ
ఈ గెలాక్సీ ఏ35 మెుబైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని సమాచారం. 50 MP ప్రైమరీ కెమెరా + 8 MP అల్ట్రావైడ్ + 2 MP సెన్సార్ ఫోన్ వెనక భాగంలో ఉంటాయట. ఇక ముందు వైపు 13 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేస్తారని తెలిసింది.
బ్యాటరీ సామర్థ్యం
ఈ శాంసంగ్ ఫోన్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి Li-Po 5000mAh బ్యాటరీని అమర్చనున్నారు. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని సమాచారం.
అడిషనల్ ఫీచర్లు
ఈ మెుబైల్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. ఇందులో Wi-Fi 802.11, Bluetooth 5.3, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ధర ఎంతంటే?
Samsung Galaxy A35 ఫోన్ ధర, విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ ఫోన్ వచ్చే ఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.28,999 వరకూ ఉండొచ్చని అంచనా. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం