Samsung Galaxy A55 5G: కళ్లు చెదిరే గెలాక్సీ ఫోన్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy A55 5G: కళ్లు చెదిరే గెలాక్సీ ఫోన్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    Samsung Galaxy A55 5G: కళ్లు చెదిరే గెలాక్సీ ఫోన్‌తో వస్తోన్న శాంసంగ్‌.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

    November 22, 2023

    ప్రముఖ మెుబైల్‌ కంపెనీ శాంసంగ్‌ సరికొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘Samsung Galaxy A55 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు ఆ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘Galaxy A54 5G’ మెుబైల్‌కు అప్‌డేట్‌ వెర్షన్‌గా ఈ నయా మెుబైల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలిసింది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌ ఫీచర్ల సమాచారం ఆన్‌లైన్‌లో లీకయ్యింది. అవి సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. 

    ఫోన్ డిస్‌ప్లే

    ఈ నయా గెలాక్సీ మెుబైల్‌ 6.6 అంగుళాల Super AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్‌ రేట్, 1080 x 2340 పిక్సెల్స్‌ క్వాలిటీ, పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను కూడా అందిస్తున్నట్లు తెలిసింది. Android v14 OS, Octa Core ప్రొసెసర్‌తో ఫోన్‌ వర్క్‌ చేయనుంది.

    కెమెరా క్వాలిటీ

    ఈ ఫోన్‌ ట్రిపుల్‌ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. 50 MP + 12 MP + 5 MP కెమెరాలు ఫోన్‌ వెనక భాగంలో ఉండనున్నాయి. ఇక ముందు వైపు 32 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేస్తారని తెలిసింది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ Samsung Galaxy A55 5G మెుబైల్‌ 8GB RAMతో రాబోతున్నట్లు తెలుస్తోంది. 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఫోన్‌కు అందిస్తారని సమాచారం. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని 1TB వరకూ పెంచుకునే ఫెసిలిటీని కల్పిస్తారట.

    బ్యాటరీ సామర్థ్యం

    ఈ శాంసంగ్‌ మెుబైల్‌ పవర్‌ఫుల్‌ బ్యాటరీతోనే రానుందట. దీనికి 5000 mAh బ్యాటరీని ఫిక్స్ చేస్తారని తెలిసింది. ఇది 30W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుందట.

    ధర ఎంతంటే?

    ఈ ఫోన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్‌ అయ్యే అవకాశముందని టెక్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని ధర రూ.39,990 వరకూ ఉండొచ్చని సమాచారం. దీనిపై త్వరలోనే శాంసంగ్‌ క్లారిటీ ఇవ్వనుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version