ప్రముఖ కొరియన్ కంపెనీ శాంసంగ్‌కు వరల్డ్ వైడ్‌గా ఎంతో గుడ్‌విల్ ఉంది. ఆ కంపెనీ రిలీజ్ చేసే ఫోన్లు, టెక్ గ్యాడ్జెట్స్‌కు మార్కెట్‌లో యమా క్రేజ్ ఉంది. ఈ కంపెనీ ప్రొడక్ట్స్‌ను కొనేందుకు టెక్ ప్రియులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వారు కొత్తగా రాబోయే ‘Samsung Galaxy Buds FE’ ఇయర్‌బడ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ బడ్స్‌కు సంబంధించిన సమాచారం తాజాగా లీకైంది. త్వరలో ఇవి మార్కెట్‌లోకి రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ‘Galaxy Buds FE’ సంబంధించిన ఫీచర్లు, ధరను కూడా అవి బయటపెట్టాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గేమింగ్ మోడ్
‘Samsung Galaxy Buds FE’ను ప్రత్యేకమైన గేమింగ్ మోడ్‌తో తీసుకొస్తున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇది SM-R400N మోడల్ నెంబర్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. వింగ్‌టిప్ డిజైన్ (Wingtip design) ఈ ఇయర్‌బడ్స్ రాబోతున్నాయి.
మైక్రో సెన్సార్స్
ఈ నయా ఇయర్‌బడ్స్‌లో నాలుగు మైక్రోఫోన్‌లతో పాటు టచ్ సెన్సార్లు కూడా ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే చిన్న, మధ్యస్థ, పెద్ద సైజు సిలికాన్ టిప్స్ (Silicone tips)తో ఇవి రానున్నట్లు తెలిసింది.
టచ్ కంట్రోల్స్
ఈ ఇయర్ బడ్స్‌ను మల్టిపుల్ టచ్ కంట్రోల్స్‌తో తీసుకొస్తున్నట్లు లీకైన యూజర్ మాన్యువల్ చెబుతోంది. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ANC టెక్నాలజీని ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. దీనివల్ల పెద్ద పెద్ద శబ్దాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోన్ మాట్లాడవచ్చు.
సౌండ్ క్వాలిటీ
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తాజాగా ఈ ఇయర్‌బడ్స్ గురించి ఓ ప్రమోషనల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ప్రీమియం సౌండ్ క్వాలిటీ (Premium sound quality), అద్బుతమైన లిజనింగ్ అనుభవం (Excellent listening experience), శక్తివంతమైన బేస్‌తో గొప్ప ధ్వని (Rich sound with powerful bass) అని అందులో రాసుకొచ్చింది.
కలర్స్
‘Galaxy Buds FE’ ఇయర్‌బడ్స్ రెండు కలర్ వేరియంట్లలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలుపు (White), గ్రాఫైట్ గ్రే (Graphite Gray) రంగుల్లో ఇవి టెక్ ప్రియులను పలకరించనున్నాయి.
ధర ఎంతంటే?
ఈ నయా ఇయర్‌బడ్స్ విడుదల తేదీ, ధరను శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అక్టోబర్ తొలి అర్ధభాగంలోనే ఇవి మార్కెట్‌లోకి వస్తాయని టెక్ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి. అలాగే వీటి ధర రూ.8,499 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!