Samsung Galaxy S24 Series: శాంసంగ్‌ నుంచి ఫస్ట్ టైం AI స్మార్ట్‌ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy S24 Series: శాంసంగ్‌ నుంచి ఫస్ట్ టైం AI స్మార్ట్‌ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!

    Samsung Galaxy S24 Series: శాంసంగ్‌ నుంచి ఫస్ట్ టైం AI స్మార్ట్‌ ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!

    February 29, 2024

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) సరికొత్త గెలాక్సీ సిరీస్‌ను లాంచ్ చేసింది. గెలాక్సీ ఎస్24 (Samsung Galaxy S24 Series) పేరుతో నయా సిరీస్‌ను బుధవారం (జనవరి 17) ఆవిష్కరించింది. టెక్‌ ప్రియులను ఆకర్షించే ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయని శాంసంగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మెుబైల్‌కు సంబంధించిన ప్రీ బుకింగ్స్‌ కూడా ఇవాళే ప్రారంభమయ్యాయి. దీంతో ఈ ఫోన్‌ ఫీచర్ల గురించి తెలుసుకునేందుకు టెక్‌ ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు. కాబట్టి గెలాక్సీ ఎస్24 సిరీస్‌ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

    మూడు వేరియంట్లలో..

    Galaxy S24 Series మూడు వేరియంట్లలో మెుబైల్స్‌ను కలిగి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 24 (Samsung Galaxy S24), గెలాక్సీ ఎస్‌24 ప్లస్‌ (Galaxy S24+), గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా (Galaxy S24 Ultra) మోడల్స్‌లో ఫోన్‌ లాంచ్‌ అయ్యాయి.

    మెుబైల్‌ స్క్రీన్‌ 

    గెలాక్సీ ఎస్24 మోడల్‌ 6.2 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. S 24+, S24 Ultra వేరియంట్లు 6.7 అంగుళాలు, 6.8 అంగుళాల QHD+ స్క్రీన్‌తో లాంచ్ అయ్యాయి. వీటికి 120Hz రిఫ్రెష్ రేట్, 2600 Nit పీక్ బ్రైట్‌నెస్‌ అందించారు. S24 Ultra మోడల్‌లో ఎస్ పెన్ కూడా ఉంటుంది. ఈ అల్ట్రా ఫోన్ టిటానియం ఫ్రేమ్‌తో తయారవ్వగా మిగిలిన రెండు వేరియంట్లు అల్యూమినియం మెటీరియల్‌తో రూపొందాయి.

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ నయా గెలాక్సీ సిరీస్‌ వేరియంట్ల ఆధారంగా వివిధ రకాల ర్యామ్‌, స్టోరేజ్‌ ఆప్షన్స్‌ను కలిగి ఉన్నాయి. గెలాక్సీ ఎస్‌24 మోడల్‌ 8GB+256GB, 8GB+512GB వేరియంట్లలో, S24+ను 12GB+256GB, 12GB+512GB ఆప్షన్స్‌లో పొందవచ్చు. ఎస్‌24 అల్ట్రాను 12GB+256GB, 12GB+512GB, 12GB+1TB స్టోరేజ్‌ వేరియంట్లలో దక్కించుకోవచ్చు.

    కెమెరా

    Galaxy S24 Ultra మోడల్‌.. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 200MP ప్రైమరీ + 50MP టెలిఫొటో + 10MP సపోర్టింగ్ సెన్సార్‌ + 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఫోన్‌ వెనుక భాగంలో ఉన్నాయి. Galaxy S24, Galaxy S24+ వేరియంట్లు.. 50MP ప్రైమరీ + 10MP టెలిఫొటో + 12 అల్ట్రా వైడ్ కెమెరాలతో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ మూడు ఫోన్లకు 12MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్‌ చేశారు. ఈ మెుబైల్స్‌తో 8K రిజల్యూషన్ క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

    బిగ్‌ బ్యాటరీ

    Samsung Galaxy S24 సిరీస్‌లోని మూడు వేరియంట్లు మూడు రకాల బ్యాటరీలతో లాంచ్‌ అయ్యాయి. Galaxy S24 మోడల్‌ 4,000mAh బ్యాటరీతో రాగా.. Galaxy S24+, Galaxy S24 Ultra వేరియంట్లు వరుసగా 4,900mAh, 5,000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఎస్24 అల్ట్రా, ఎస్24+ కి 45W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌కు ఇది 25Wగా ఉంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్‌ కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి

    AI ఫీచర్స్‌

    శాంసంగ్‌ గెలాక్సీ ఎస్24, ఎస్ 24+, ఎస్24 అల్ట్రాలో అనేక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్ ఉన్నాయి. ఫొటోల్లో ఏదైనా ఒకదాన్ని సర్కిల్ చేసి సైజును అడ్జెస్ట్ చేసుకోవచ్చు. జతచేయడం, తొలగించడం వంటివి చేయవచ్చు. క్రియేటివిటీ కోసం జెనరేటివ్ ఎడిట్ ఫీచర్‌ని వాడుకోవచ్చు. అంతేకాకుండా ఏ వీడియోనైనా స్లో మోషన్ వీడియోగా మార్చుకోవచ్చు.

    ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌

    ఈ కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కొనుగోలు చేస్తే 7 ఏళ్లపాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, సెక్యూరిటీ ప్యాచ్‌లను ఉచితంగా పొందవచ్చు. అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఐపీ68 రేటింగ్‌తో ఉంటాయి. ఇది ఫోన్లకు దుమ్ము, దూళి నుంచి రక్షణను అందిస్తుంది.

    కలర్ ఆప్షన్స్‌

    Galaxy S24 మోడల్‌.. ఆంబర్ ఎల్లో (Amber Yellow), కోబాల్ట్‌ వైలెట్‌ (Cobalt Violet), ఒనీక్స్ బ్లాక్‌ (Onyx Black) రంగుల్లో లభించనుంది. Galaxy S24+ కేవలం కోబాల్ట్‌ వైలెట్‌ (Cobalt Violet), ఒనీక్స్ బ్లాక్‌ (Onyx Black) కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. ఇక S24 Ultraను టైటానియం గ్రే, టైటానియం వైలెట్‌, టైటానియం బ్లాక్‌ రంగుల్లో పొందవచ్చు. 

    ధర ఎంతంటే?

    Galaxy S24 సిరీస్‌ ధరలు అధికారికంగా విడుదలయ్యాయి. S24 Ultra ప్రారంభ వేరియంట్‌ ధర రూ.1,29,999గా ఉంది. Galaxy S24 బేసిక్‌ మోడల్‌ (8GB + 256GB)ను రూ.79,999లకు శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. Galaxy S24+ ప్రారంభ వేరియంట్‌ (12GB + 256GB)ధర రూ.99,999గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌, రిటైల్‌ స్టోర్ల ద్వారా ప్రీబుకింగ్స్‌ చేసుకోవచ్చు. ప్రీబుకింగ్స్‌ చేసుకుంటే ఆకర్షణీయమైన రాయితీలు కూడా పొందవచ్చని శాంసంగ్‌ వర్గాలు వెల్లడించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version